- Home
- Life
- Spiritual
- Mahashivaratri: మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడిని మొగలిపువ్వులతో పూజిస్తే అవన్నీ ఫలిస్తాయట
Mahashivaratri: మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడిని మొగలిపువ్వులతో పూజిస్తే అవన్నీ ఫలిస్తాయట
Mahashivaratri: మీరెప్పుడైనా మొగలిపువ్వులను చూశారా? చుట్టూ ముళ్ల ఆకులతో ముట్టుకుంటే గుచ్చుకొనేంత షార్ప్ గా ఉంటాయి. మరి అలాంటి పుష్పాలతో మహా శివరాత్రి రోజు శివుడిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శివపురాణం చెబుతోంది. ఆ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం రండి.

శివుడి భక్తులకు మహా శివరాత్రి చాలా ముఖ్యమైన రోజు. పరమేశ్వరుడి అనుగ్రహం పొందడానికి ఆ రోజు ఎవరి శక్తి మేరకు వారు రకరకాల పూజలు చేస్తారు. అయితే మొగలిపువ్వులతో ఆ సర్వేశ్వరుడిని పూజిస్తే జన్మజన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ జగత్తుకు మూలం పరమేశ్వరుడని భక్తుల విశ్వాసం. ఇదే విషయాన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చెబుతుంటాయి. కేవలం భూలోకం ఒకటే కాకుండా మొత్తం 14 లోకాలు ఉన్నాయని, వీటన్నిటినీ నడిపిస్తున్నది పరమేశ్వరుడని చెబుతుంటారు. ఇన్ని కోట్ల జీవరాశులను సృష్టించి, వాటి శక్తియుక్తులకు సరిపడా ఆయుష్షు నిచ్చి చివరికి అంతం చేసేది కూడా మహాశివుడేనని వేదాలు వర్ణిస్తాయి.
ఇన్ని లోకాలను నడిపిస్తున్న ఆ సర్వేశ్వరుడికి ఎవరి శక్తి మేరకు వారు కృతజ్ఞత చూపించడం కోసం మహాశివరాత్రి రోజు వివిధ రకాల పూజలు చేస్తారు. కొందరు కొబ్బరి కాయలు, అరటిపళ్లు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. మరికొందరు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార వంటి పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. మరికొందరు వివిధ రకాల పండ్ల రసాలతో స్వామి వారిని అభిషేకిస్తారు.
అయితే మొగలి పువ్వులతో పరమేశ్వరుడిని మహాశివరాత్రి రోజు పూజిస్తే విశేష ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మొగలిపువ్వులంటే మహా శివుడికి చాలా ఇష్టమైన పుష్పమని, వాటి నుంచి వచ్చే సువాసనకు శివుడు ప్రసన్నమవుతాడని శివపురాణంలో పేర్కొన్నారు.
శివ పురాణంలో ఉన్న వివరాల ప్రకారం మహా శివరాత్రి రోజు శివలింగానికి మొగలిపువ్వులతో పూజ చేస్తే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది.
శత్రువుల అడ్డుతొలగిపోతుంది.
గత జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.
రోగాలు నయం అయి శరీరం పూర్తి ఆరోగ్యంగా మారుతుంది.
ఆయుష్షు పెరుగుతుంది.
సిరి సంపదలు పెరిగి కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు.
ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి.