Chandra Grahan 2025: గ్రహణ కాలంలో గర్భిణీలు ఏం చేయాలి?
సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. మరి, ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి..? నిపుణులు ఏం చెబుతున్నారు?
16

Image Credit : Getty
చంద్ర గ్రహణం ఎప్పుడు..?
ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఏర్పడుతోంది. ఈ చంద్ర గ్రహణం భారత్ లో కూడా కనపడుతుంది. కాబట్టి… గ్రహణ ప్రభావం భారత్ పై కూడా ఉంది. మరి, ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం…
26
Image Credit : ChatGpt
గ్రహణానికి దూరంగా గర్భిణీ స్త్రీలు..
గర్భిణీ స్త్రీలు నేరుగా గ్రహణానికి గురికాకూడదు. ఆ సమయంలో బయటకు వచ్చి.. గ్రహాణాన్ని చూడకపోవడమే మంచిది. గ్రహణం సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు. ఇంటి కిటికీలు, తలుపులు కూడా మూసివేయాలి.
36
Image Credit : Getty
పదునైన వస్తువులు...
గ్రహణం సమయంలో గర్భిణులు పదునైన వస్తువులు వాడకూడదు. కత్తెర, కత్తి, సూది వంటివి వాడటం వలన పిల్లలకు శారీరక లోపాలు రావచ్చు. కాబట్టి.. అలాంటి వస్తువులు వాడకూడదు. వాటిని తాకకూడదు.
46
Image Credit : Getty
ఆహారం...
చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఏమీ తినకూడదు, త్రాగకూడదు. గ్రహణం ప్రారంభం కావడానికి ముందే భోజనం చేయాలి.
56
Image Credit : Getty
గ్రహణ సమయంలో నిద్రపోవచ్చా?
గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో నిద్రపోకూడదు. గ్రహణం సమయంలో నిద్రపోవడం మంచిది కాదు.
66
Image Credit : Getty
గ్రహణ సమయంలో గర్భిణీలు ఏం చేయాలి?
చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు మంత్ర జపం చేయవచ్చు. ఇది గర్భంలో ఉన్న శిశువుపై శుభప్రభావాన్ని చూపుతుంది.
Latest Videos