MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం.. భారత్ లో కనపడుతుందా..?

ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం.. భారత్ లో కనపడుతుందా..?

 అక్టోబర్ నెల 29వ తేదీన ఈ రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్ 14న సంభవించిన సూర్యగ్రహణం తర్వాత 14 రోజుల తర్వాత ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 26 2023, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
lunar eclipse

lunar eclipse

ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం మన కళ్లముందుకు రావడానికి రెడీ అయ్యింది. అక్టోబర్ నెల 29వ తేదీన ఈ రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్ 14న సంభవించిన సూర్యగ్రహణం తర్వాత 14 రోజుల తర్వాత ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
chandra grahan 2023 rashifal

chandra grahan 2023 rashifal

చంద్రగ్రహణం అంటే ఏమిటి?
నాసా ప్రకారం, చంద్రగ్రహణం పౌర్ణమి దశలో సంభవిస్తుంది. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీనినే చంద్ర గ్రహణం అంటారు. కొన్నిసార్లు చంద్రుని ఉపరితలం కొన్ని గంటల వ్యవధిలో ఎరుపు రంగులోకి మారుతుంది. ప్రతి చంద్ర గ్రహణం భూమి  సగం నుండి కనిపిస్తుంది.

37
Lunar eclipse October 2023 Sutak time

Lunar eclipse October 2023 Sutak time

పాక్షిక చంద్రగ్రహణం అంటే ఏమిటి?
పౌర్ణమి, సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది.

47
Lunar Eclipse 2023 Rashifal 3

Lunar Eclipse 2023 Rashifal 3

పాక్షిక చంద్రగ్రహణం తేదీ:
సైన్స్ మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన ప్రకారం, 28-29 అక్టోబర్, 2023 (6-7 కార్తీక, 1945 శక శకం) పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. అక్టోబరు 28 అర్ధరాత్రి చంద్రుడు పెనుంబ్రాలోకి ప్రవేశించినప్పటికీ, అంబ్రల్ దశ అక్టోబర్ 29 ప్రారంభ గంటలో ప్రారంభమవుతుంది.

57
Image: Getty Images

Image: Getty Images

భారతదేశంలో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుందా?
 పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, తూర్పు దక్షిణ అమెరికా, ఈశాన్య ఉత్తర అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణం కనిపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. అక్టోబర్ 28వ తేది ఉదయం 3 గంటల 17 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంటుంది. అయితే పౌర్ణమి పూజలు చేయాలనుకునేవారు తప్పకుండా ఉదయం 4:10 నిమిషాల వరకు మతపరమైన కార్యక్రమాలు చేయవచ్చు.
 

67

ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అశ్విని శుక్ల పౌర్ణమి అక్టోబర్ 28వ తేదీన సంభవించబోతోంది. అయితే ఈ గ్రహణం ప్రభావం తప్పకుండా భారతదేశంపై కూడా పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భారతదేశంతో పాటు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలలో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. 

77

భారతదేశంలో తదుపరి చంద్రగ్రహణం తేదీ ఎప్పుడు ?
 తదుపరి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది, ఇది 7 సెప్టెంబర్ 2025న భారతదేశం నుండి కనిపిస్తుంది.  భారతదేశం 2022 నవంబర్ 8న చివరి చంద్రగ్రహణాన్ని చూశారు, ఇది సంపూర్ణ గ్రహణం కావడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Tips For Wealth: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే ఈ 5 చేస్తే చాలు!
Recommended image2
Top 10 Spiritual Temples: ఇండియాలో మీరు తప్పక సందర్శించాల్సిన 10 టెంపుల్స్ ఇవే
Recommended image3
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved