Sankranthi 2022: మీరు భోగి మంటలు వెయ్యరా... భోగి మంటలు వేస్తే ఇంట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా?
కొత్త సంవత్సరం మొదటి నెలలో ప్రారంభమయ్యే అది పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ముందు వచ్చే పండుగనే భోగి పండుగ (Bhogi festival). భోగి పండుగ అనే పదానికి తొలినాడు అనే అర్థం కూడా ఉంది. ఈ పండుగ రోజు భోగి మంటలు (Bhogi mantalu) వేస్తారు. అయితే భోగినాడు భోగి మంటలు ఎందుకు వేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భోగినాడు భోగి మంటలు వేయడం అంటే చాలామంది చలి నుంచి కాపాడుకోవడానికి, వెచ్చదనం (Warmth) కోసం వేసుకునే మంటలుగా భావిస్తారు. కానీ భోగి మంటల వెనుక ఒక ఆచారం ఉందని పురాణకథనం. భోగి అనే పదాన్ని భగ అనే పదం నుండి తీసుకోబడినది. భగ అంటే మంటలు (Fires) అని అర్థం.
శ్రీమహావిష్ణువు (Shri Mahavishnuvu) వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని బలి చక్రవర్తికి వరమివ్వడం జరిగింది. ఇలా బలి చక్రవర్తి (Bali Chakravarti) రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారు అని మన పురాణ కథనం.
దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను (Worries) అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలనే భోగి మంటలు అంటారు. సంస్కృతం ప్రకారం భోగం అంటే సుఖం అని అర్థం. భోగిమంటలు వెచ్చదనంతో పాటు ఆరోగ్యాన్ని (Health) కూడా అందిస్తాయి.
ధనుర్మాసం నెలంతా ఇంటిముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. ఇలా చేసుకున్న పిడకలను భోగిమంటలలో వాడుతారు. భోగి మంటలలో దేశి ఆవు పేడ పిడకలను వేసి కాల్చితే గాలి శుద్ధి (Air purification) అవుతుంది. దీంతో గాలిలోని సూక్ష్మక్రిములు (Germs) నశించిపోతాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. ఈ గాలిని పీల్చుకుంటే ఆరోగ్యానికి మంచిది.
చలికాలంలో ఇన్ఫెక్షన్ల (Infections) కారణంగా ఏర్పడే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఏర్పడే శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గించడానికి ఔషధంగా (Medicine) సహాయపడుతుంది. భోగి మంటలలో రవి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అలాగే ఈ మంటలలో ఆవు నెయ్యిని కూడా జోడిస్తారు.
ఈ భోగి మంటలలో వేయబడిన 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణవాయువు (Oxygen) విడుదలవుతుంది. ఈ వాయువు అతి శక్తివంతమైనది. ఈ గాలిని పీలిస్తే శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కనుక భోగి మంటలను వేయడం సంప్రదాయంగా (Traditionally) మన పెద్దలు పూర్వం నుంచి పాటిస్తున్న ఆచారం.
భోగి మంటలలో ప్లాస్టిక్ వస్తువులను, ఇతర హానికర వాయువులను విడుదల చేసే వస్తువులను వేయరాదు. నిజానికి భోగి మంటలలో కాల్చాల్సింది మనలోని చెడు అలవాట్లు (Bad habits), చెడు ఆలోచనలు. ఇలా మనస్సును శుద్ధి చేసుకొని మానసిక ఆరోగ్యం, విజయాలను (Achievements) కలిగించమని ఆ అగ్ని దేవుణ్ణి కోరుకోవాలి.