MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?

కార్తీక పౌర్ణమి నాడు గంగా స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?

Karthika Pournami 2023: కార్తీక పౌర్ణమిని అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన రోజుల్లో ఒకటిగా భావిస్తారు. ఈ రోజున చాలా మంది గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సనాతన ధర్మంలో దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ కార్తీక మాసం విష్ణుమూర్తికి, కృష్ణుడి ఆరాధనకు అంకితం చేయబడింది. కార్తీక మాసం కార్తీక పౌర్ణమితో ముగుస్తుంది. మరి గంగాస్నానం చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 26 2023, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Karthika Pournami 2023: కార్తీక పౌర్ణమిని ఎంతో పవిత్రమైన పండుగగా భావిస్తారు. ఈ రోజున కొంతమంది ఖచ్చితంగా గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సనాతన ధర్మంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది వచ్చే కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువును, శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఇది కార్తీక పౌర్ణమితో ముగుస్తుంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 27 అంటే సోమవారం నాడు వచ్చింది. 

గంగా స్నాన తేదీ

పౌర్ణమి తిథి ప్రారంభం - నవంబర్ 26 - 03:53

పూర్ణిమ తిథి ముగింపు - నవంబర్ 27 - 02:45

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

గంగా స్నానం ప్రాముఖ్యత

సనాతన ధర్మంలో గంగానది స్నానానికి ఎంతో ధార్మిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భక్తులు గంగానదిలో స్నానమాచరిస్తారు. విష్ణుమూర్తిని పూజిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి గంగానదిలో స్నానమాచరిస్తుంటారు. హరిద్వార్, రిషికేష్, వారణాసి, నాసిక్, కురుక్షేత్ర, పుష్కర తదితర ప్రదేశాలనుసందర్శించే పవిత్ర దినాలలో కార్తీక పౌర్ణమి ఒకటి.
 

34

ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన వారికి గతంలో జరిగిన చెడంతా తొలగిపోతుంది. కష్టనష్టాల నుంచి బయటపడతారని నమ్ముతారు. అంతేకాదు భక్తుల సకల బాధలు తొలగిపోతాయని విశ్వాసం. దీనితో పాటుగా ఈ ప్రత్యేకమైన రోజున గంగా నది దగ్గర దీపాన్ని వెలిగించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. 
 

44


గంగా స్నానం పూజా విధి

కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించాలి.

గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి వీళ్లేకపోతే ఈ పవిత్రమైన రోజున మీ స్నానపు నీటిలో గంగా నీటిని కలపండి. 

ఈ రోజున సూర్యభగవానుని పూజించడం కూడా ఎంతో ప్రయోజనకరంగా భావిస్తారు. 

సూర్య భగవానునికి అర్ఘ్యం చేసేటప్పుడు 'ఓం ఆదిత్యాయ నమః' అని జపించండి. దీంతో మీరు ఆయన అనుగ్రహం పొందుతారు. 

సాయంత్రం పూట గంగానదిలో స్నానం చేసే భక్తులు చంద్ర దేవుడికి అర్ఘ్యం సమర్పించాలి. 

ఈ రోజున గంగామాత ముందు కనీసం ఒక్క దీపాన్నైనా వెలిగించండి. వీలైతే 7 దేశీ నెయ్యి దీపాలను వెలిగించడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved