ఈ రోజే కార్తీక పౌర్ణమి.. ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదంటే?
Karthika Pournami 2023: కార్తీక మాసం మహావిష్ణువుకు అంకితం చేయబడింది. అలాగే పూర్ణిమ తిథి కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ పవిత్రమైన రోజు గంగానదిలో స్నానం చేస్తే ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మరి ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
Karthika Pournami 2023: హిందూ మతంలో పౌర్ణమి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పౌర్ణమి నాడు చాలా మంది విష్ణుమూర్తిని పూజిస్తారు. అలాగే ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ 29 న ప్రారంభమైంది. ఈ కార్తీక మాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడిందని నమ్ముతారు. మరి ఈ రోజులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కార్తీక పౌర్ణమి ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం.. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 26 ఆదివారం నాడు మధ్యాహ్నం 03:53 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే పూర్ణిమ తిథి నవంబర్ 27 సోమవారం మధ్యాహ్నం 02:45 గంటలకు ముగుస్తుంది. కాబట్టి కార్తీక పౌర్ణమిని మనం నవంబర్ 27 న అంటే ఈ రోజే జరుపుకుంటున్నాం.
ఏ పని చేయాలంటే?
మత విశ్వాసాల ప్రకారం.. కార్తీక పౌర్ణమి నాడు గంగాస్నానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు గంగానదిలో స్నానమాచరిస్తే మీరు చేసిన సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజు అవసరమైన వారికి దానం చేయడం వల్ల మీకు పుణ్యం దక్కుతుంది. ఈ రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. పరిశుభ్రమైన ఇంటికే లక్ష్మీదేవి వస్తుందనే నమ్మకం ఉంది.
ఈ వస్తువులను దానం చేయండి
పౌర్ణమి నాడు అవసరమైన వారికి పంచదార, బియ్యం వంటి తెల్ల వస్తువులను దానం చేయొచ్చు. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ఇది పుణ్యఫలాలను ఇస్తుందనే నమ్మకం ఉంది. అలాగే ఈ రోజు దీపదానం కూడా చేయొచ్చు. దీన్ని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ రోజు మీరు సాయంత్రం వేళ దీపదానం చేయండి. అలాగే మీ ఇంటిని దీపాలతో అలంకరించండి. దీంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
ఈ తప్పులు చేయకండి
తులసిని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం. కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకండి. అలాగే మాంసాన్ని తినకండి. ఆల్కహాల్ కు దూరంగా ఉండండి. కార్తీక పౌర్ణమి నాడు ఎవరినీ తిట్టకండి. దూషించకండి. ఇలా చేస్తే మీపై విష్ణుమూర్తి అనుగ్రహం ఉండదు.