MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • పూజకు ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలో తెలుసా?

పూజకు ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలో తెలుసా?

ఒక్క నవరాత్రుల్లోనే కాదు.. రెగ్యులర్ గా మనం దేవుడికి పూలను సమర్పిస్తుంటాం. ఈ పవ్వులను చాలా పవిత్రంగా భావిస్తుంటాం. ఈ పువ్వును బయట కూడా పారేయడానికి  ఇష్టపడరు. కానీ పూజ చేసేటప్పుడు పాత పువ్వులను తీసేసి కొత్త పువ్వులను దేవుడి దగ్గర పెడుతుంటారు. మరి ఈ పాత పువ్వులను ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 07 2024, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నవరాత్రుల్లో దుర్గామాతను తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజించి  పూలను సమర్పిస్తుంటారు. మరుసటి రోజు దేవతను అలంకరించే సమయంలో ఈ పూలన్నింటీని తొలగించి కొత్త పూలను సమర్పిస్తారు. అయితే చాలా మంది ఈ పువ్వులు దేనికీ పనికి రావని పారేస్తుంటారు. ఈ పువ్వులనే కాదు ఇంట్లో పూజ చేసిన పువ్వులను కూడా ఇలాగే చేస్తారు. కానీ ఈ పువ్వులు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మీకు తెలుసా? పూజకు ఉపయోగించిన పూలను ఇంటి నుంచి తోట పనుల వరకు ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. అందుకే దుర్గామాతకు లేదా ఇంట్లో దేవుడికి సమర్పించిన పువ్వులను తిరిగి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

దేవుడికి సమర్పించిన పాత పూలతో ఏం చేయాలి? 

మనలో చాలా మంది పూజ చేసిన తర్వాత చాలా వస్తువలను దేనికీ ఉపయోగపడవని భావిస్తుంటారు. వాటిని చెత్తలో వేస్తుంటారు. కానీ వీటితో ఎన్నో పనులు చేయొచ్చు. ముఖ్యంగా మీరు వీటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించొచ్చు. తోటపనిని ఇష్టపడే వారికి ఎండిపోయిన పువ్వులను ఎన్నో విధాలుగా సహాయపడతాయి. 
 

34

ఉపయోగించిన పువ్వులతో అగర్ బత్తిని ఎలా తయారు చేయాలి?

దేవుడికి సమర్పించిన పువ్వులను మీరు అగర్ బత్తీలను తయారుచేయడానికి కూడా ఉపయోగించొచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఉపయోగించే పువ్వులు మురికిగా లేదా చెడిపోయినవి అయ్యి ఉండకూడదు.

44

శుభ్రమైన పువ్వులను తీసుకుని వాటి కాడలను తొలగించి రేకులను ఎండలో బాగా ఎండబెట్టండి. ఆ తర్వాత పువ్వులను గ్రైండర్ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోండి.  ఆవు పేడ పిడకలు, గుగ్గుల పొడి, కర్పూరం, లవంగాలు, గంధం, సుగంధ ద్రవ్యాలు, నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు తయారు చేసిన మెటీరియల్ నుంచి అగర్ బత్తీలను తయారు చేసుకోవాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved