MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • దేవుడి హుండీలో ఎన్ని డబ్బులు వేయాలి, ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..?

దేవుడి హుండీలో ఎన్ని డబ్బులు వేయాలి, ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..?

మనసునిండా భక్తితో గుడికి వెళ్లి కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. అయితేఎవరి స్థామతకు తగ్గట్టు వారు హుండీలో డబ్బులు వేస్తారు. మరి హుండీలో  ఎన్ని డబ్బులు వేస్తే మంచింది...? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Nov 11 2024, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మనసు ప్రశాంతత కోసం.. ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి కోసం.. సంతానం, కుటుం సమస్యల లాంటి ఎన్నో ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలి తెలియక.. ఆదేవుడి కి మొరపెట్టుకోవడం కోసం గుడికి వెళ్తుంటారు భక్తలు. ఇక అన్నీ ఉన్నా.. భక్తితో గుడికి వెళ్ళేవారు కూడా ఎందరో. గుడిలో అడుగు పెట్టగానే భాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి.. పాజిటీవ్ వైబ్రేషన్స్ తో హ్యాపీగా ఉంటుంటారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అంతే కాదు తమ స్ధోమతకు తగ్గట్టు కానుకలు కూడా సమర్పించుకుంటారు. తిరుమల తిరుపతి లాంటి  పెద్ద పెద్ద దేవాలయాలలో దేవడికి బంగారు కిరీటాలు చేయిస్తుంటారు. నగలు చేయిస్తారు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. లక్షలకు లక్షలు హుండీలో వేస్తుంటారు. తిరుపతి హుండీలో రోజు పేదా ధనిక అందరు వేసే కానుకలు కోటి నుంచి ఐదు కోట్ల వరకూ ఉంటుంటాయి. 

అలా చిన్నా పెద్ద గుడులలో హుండీలలో అంతో ఇంతో కానుకలు వేయడం సాధారణం. అయితే హుండీలో కానుకలు వేయడానికి కూడా ఓ లెక్క ఉందట. ఈ విషయం మీకు తెలుసా..? ఏదేవుడి గుడిలో ఎంత  కానుక వేస్తే మంచి జరుగుతుందో తెలుసా..? ఈ విషయంలో పెద్దలు, స్వాములు ఏం చెపుతున్నారు. ..? దీనికి సబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే..? 

36

ముందుగా  తిరుమల తిరుపతి నుంచి మొదలు పెడుదాం.. తిరుమలకు ఏడు  కొండలు ఏడు.. సప్త రుషులు ఉన్నారు కాబట్టి.. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో రూ.7 వేస్తే.. అనేక రోగనాశనం అని అంటున్నారు. ఆరోగ్యాలు కలగడం కోసం తిరుమల హుండీలో7 రూపాయలు వేయాలట. 
 

46

ఇక అమ్మవార్ల విషయానికి వస్తే.. విజయవాడ దుర్గమ్మవారితో పాటు..  నవ రాత్రులు పూజ చేసే అమ్మవార్ల గుడిలో నవరాత్రుల  సంఖ్య తొమ్మిది కాబట్టి.. శత్రు బాధలు, శని బాధలు దూరం కావాలంటే హుండీలో 9 రూపాయలు వేయాలని అంటున్నారు.  అమ్మవారి గుడి అనే కాదు. ఏగుడిలో ఈ సంఖ్య తో డబ్బు హుండీలో వేసినా.. ఆ ఫలితం కలుగుతుందట. 

ఇక 11 రూపాయలు ఎందుకు వేయాలంటే..  11 సంఖ్య చంద్రుడికి అనుకూలమైన సంఖ్య. 11 రూపాయలను హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి అంతే కాదు ఎప్పటి నుంచో వెంటాడుతున్న బాధలు కూడా మాయం అవుతాయని అంటున్నారు అంతే కాదు కాళికాదేవి సిద్ధి సంఖ్య 12. ఈ నేపథ్యంలో 12 రూపాయలు హుండీలో వేస్తే కుటుంబానికి రక్షణగా ఉంటుందట. అంతే కాదు.. అట్టడుగున ఉన్నవారు కూడా ఆర్ధికంగా  ఎదుగుదలకు దారి దోరుకుతుందంటున్నారు. 

56
pathmanabha temple

pathmanabha temple

మనం ఏ పూజ చేసినా..గణపతిని ముందుగా తలుచుకుంటాము. అలాంటి మహాగణపతి అనుగ్రహ సంఖ్య 21. ఈ నేపథ్యంలో హుండీలో 21 రూపాయలు వేస్తే దురదృష్టం పోతుందట..  అదృష్టం  వరించడంతో పాటు..  పని మొదలు పెట్టిన విఘ్నాలు తొలగిపోతాయి అంటున్నారు పెద్దలు. అంతే కాదు గురు అనుగ్రహ సంఖ్య 54. అందుకే హుండీలో 54 రూపాయలు వేస్తే సకల విజయాలు కలుగుతాయని తెలుస్తోంది. అంతే కాదు. ధన లాభం కలుగుతుందట.

జాతక దోషాలు తొలగిపోవడానికి.. అనుకున్న కోరికలు నెరవేరటానికి హుండీలో 101 రూపాయి వేయాలట. ఈ సంఖ్య కల్పవృక్ష ఆధార సంఖ్య కావడంతో ఈ ఫలితం వస్తుంది అంటున్నారు. ఇక చాలా నిష్టంగా పూజించే శ్రీచక్ర యూల సంఖ్య 108. అందుకే 108 రూపాయలు హుండీలో వేస్తూ.. సకల సిద్ధి కలగడంతో సకల కోరికలునెరవేరుతాయట.  

66

పాపలు చేసేవారు దేవుడి హుండీలో డబ్బు వేసి మొక్కులు చెల్లించుకుని హమ్మయ్య అనుకుంటారు. కాని తెలియక చేసిన పాపాలకే ఈనివ్రుతి అంతే కాదు తెలిసి తప్పులు చేసి దేవుడా అంటే.. అది ఏమాతం దేవడు తీసుకోడు. ఇక తెలిసి తెలియక పాపాలు చేసేవారు. 116 రూపాయలు హుండీలో వేసి ప్రార్ధిస్తే.. పుణ్యప్రాప్తి కలుగుతుంది. సప్త జన్మల పాపం తొలగిపోతుందట. ఇలా ఎంత కానుక వేస్తే.. అన్ని ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు పెద్దలు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Recommended image2
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Recommended image3
Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved