Toli Ekadashi: పొరపాటున కూడా తొలి ఏకాదశి రోజు ఈ ఆహారం తీసుకోకూడదు.. లేదంటే అంతే సంగతి?
Toli Ekadashi: ఆషాడశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఎందుకు దీన్నే తొలి ఏకాదశి అంటారు.. ఎందుకు ఈ తిధికి అంత ప్రత్యేకత, ఈరోజున ఏం ఆహారం తీసుకోవాలో అనేది తెలుసుకుందాం.
ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి జన్మించిన కన్య పేరు ఏకాదశి. శ్రీహరి యోగ నిద్ర కు ఈరోజునే ఉపక్రమిస్తాడు. అందుకే దీనిని తొలి ఏకాదశి, చేయనా ఏకాదశి అంటారు. మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు.
అందుకే దీనిని ఉత్తాన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి పడుకొని లేవటానికి మధ్యన ఉండే నాలుగు మాసాలని పవిత్రంగా భావించి చాతుర్మ్యాస దీక్ష చేస్తారు వైష్ణవులు. ప్రస్తుతం ఈ దేశంలో మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు శాస్త్రజ్ఞ్యాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్టతో కామ క్రోధ మద మాత్సర్యాలను విసర్జించాలి.
ఆషాడ మాసం తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి తాను శుద్ధి చేసుకుని ఇంటిని శుభ్రం చేసి తరువాత శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతం చేసేవారు మాంసాహారము, వండిన ఆహారము, చింతపండు ఉసిరి ఉలవలు, మినుములతో చేసినవి ఆహారంగా తీసుకోరాదు.
అలాగే మంచం మీద నిద్ర చేయకూడదు. ఈరోజు విశిష్టమైన రోజుగా ప్రస్తావించడానికి మరొక కారణం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలుతాడు. ఈరోజు నుంచి దక్షిణాన మొదలవుతుంది కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారు ఇదే రోజు చాతుర్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
ఇలా చేయడం వలన మరణానంతరం నేరుగా వైకుంఠానికి వెళ్తారని ప్రతీతి. ఇదే పండుగని రైతులు కూడా ఘనంగా జరుపుకుంటారు. వారి పంటకి ఎలాంటి నష్టము జరగకూడదు అని వేడుకొని పేలాలను పొడి చేసి బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఏకాదశి రోజున అన్నం భుజిస్తే మంచిది కాదు అని చెప్తారు మన పెద్దలు అందుకు ఒక కథ కూడా ఉంది.
అన్నంలో దాగిన పాప పురుషుడు, బ్రహ్మ చమట బిందువు నుంచి అవతరించిన రాక్షసుడు తనకి నివసించడానికి ప్రదేశం ఇమ్మని అడుగుతాడు.అప్పుడు బ్రహ్మ ఏకాదశి రోజు భోజనం చేసేవారి భోజనంలో నివసించమని వరం ఇస్తాడు. అందుకే ఆరోజు భోజనం చేయడం అనారోగ్య హేతువని హెచ్చరిస్తారు పూర్వీకులు.