Ganesh Chaturthi 2022: వినాయక చవితి రోజు మీ బంధుమిత్రులకు ఇలా విష్ చేయండి!
Ganesh Chaturthi 2022: హిందువులు చేసుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజు వినాయకుడిని తయారుచేసి పూజించి, నైవేద్యాలు సమర్పించి అలా 11 రోజులు చేసి చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే ఈ వినాయకుడి సంబరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ganesh chaturthi 2022
చిన్న వీధుల నుండి పెద్దపెద్ద బస్తీల వరకు వినాయకుడి విగ్రహాలు పెట్టి బంధుమిత్రులతో కలిసి ఘనంగా 11 రోజులు పూజలు జరుపుతారు. అయితే కరోనా మొదలైనప్పటి నుంచి వినాయక చవితిని సరిగ్గా జరుపుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ మునుపటి వేడుకలు కనిపిస్తున్నాయి. అయితే దూరంగా ఉన్న బంధువులను, మిత్రులను మిస్ అవుతున్న వాళ్ళు వారికి సోషల్ మీడియా ద్వారా సంతోషంగా శుభాకాంక్షలు చెబితే సరిపోతుంది.
ganesh chaturthi 2022
మరి అలాంటి విషెస్ మీ కోసమే ఇప్పుడు మేము అందిస్తున్నాము. ఇక అవేంటంటే..
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక పండగ శుభాకాంక్షలు..
మా మిత్రులందరికీ భక్తితో వినాయక చవితి శుభాకాంక్షలు..
మా శ్రేయోభిలాషులు ప్రేమతో గణేష చవితి శుభాకాంక్షలు..
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..
ఈ వినాయక చవితి అందరికీ విజయాలు, సంతోషాలు అందించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు..
గణనాథుడి దీవెనలు మనతో ఉండాలని ప్రేమతో కోరుకుంటూ గణేష చతుర్థి శుభాకాంక్షలు..
బొజ్జగణపయ్యను పూజిద్దాం.. వరాలు పొందుదాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..
పార్వతీపరమేశ్వర తనయ బొజ్జగణపయ్య ప్రజలందరికీ విజయాలు అందించాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు..
సకల విఘ్నాలూ తొలగించే ఆ గణపయ్య ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు..
చేసే పనులలో ఆటంకులు రాకుండా ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయవంతం కావాలి.. సరికొత్త కాంతులు తేవాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే.. వినాయక చవితి శుభాకాంక్షలు..
ఈ విషెస్ తో మీ బంధుమిత్రులని మరింత దగ్గర చేసుకోండి.