Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ధనత్రయోదశి శుభాకాంక్షలు.. మీ ఫ్రెండ్స్ కు, కుటుంబ సభ్యులకు విషెస్ ఇలా చెప్పేయండి

ధనత్రయోదశి శుభాకాంక్షలు.. మీ ఫ్రెండ్స్ కు, కుటుంబ సభ్యులకు విషెస్ ఇలా చెప్పేయండి

dhanteras 2023: ధనత్రయోదశి పండుగను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు మనం అదృష్టాన్ని పొందడాన్ని సూచిస్తుంది. అందుకే ఈ రోజున భక్తులు ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ధన్వంతరి దేవుడిని ప్రార్థిస్తారు. ధనత్రయోదశి సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున భక్తులు ఇళ్లను శుభ్రం చేసి లక్ష్మేదేవిని పూజిస్తారు. మరి ఈ సందర్భంగా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎలా విషెస్ చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Shivaleela Rajamoni | Published : Nov 10 2023, 09:42 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో ధనత్రయోదశి ఒకటి. ఈ పండుగ ఈ ఏడాది నవంబర్ 10 అంటే ఈ రోజునే జరుపుకుంటున్నాం. ధనత్రయోదశిని ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ఐదు రోజుల దీపావళి పండుగ ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవికి నిష్టగా పూజలు చేస్తారు. ఈ రోజు అమ్మవారి అనుగ్రహం లభిస్తే జీవితంలో ఆర్థిక సమస్యలే రావని నమ్మకం ఉంది.  అంతేకాదు ఇంట్లో సిరి, సంపదలు కూడా పెరుగుతాయంటారు పండితులు. 
 

25
Image: Freepik

Image: Freepik

ధనత్రయోదశి ప్రాముఖ్యత

ధనత్రయోదశి అనే పదం 'ధన' అనే పదం నుండి ఉద్భవించింది. ధన అంటే సంపద అని అర్థం. కార్తీక మాసంలో కృష్ణపక్షం 13వ రోజున ఈ ప్రత్యేకమైన రోజు వస్తుంది. ధనత్రయోదశి మన జీవితాల్లో సంపద, శ్రేయస్సు, సంతోషం రాకను సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజున  జనాలు తమ ఇండ్లను శుభ్రం చేసి అదంగా అలంకరించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. అలాగే అమ్మవారి విగ్రహం ముందు దీపం వెలిగించి నిష్టగా పూజ చేస్తారు. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలను కొనే ఆనవాయితీ కూడా ఉంది. మరి ఈ ప్రత్యేకమైన రోజున ప్రియమైన వారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎలా శుభాకాంక్షలు చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..

35
Asianet Image

ఈ ధనత్రయోదశి మీ జీవితాన్ని సంతోషం, శ్రేయస్సుతో ప్రకాశవంతం చేయాలని కోరకుంటూ.. హ్యాపీ ధనత్రయోదశి..

ఈ ధనత్రయోదశి సందర్భంగా మీకు అపారమైన సిరి సంపదలు కలగాలని కోరుకుంటున్నాను. ధనత్రయోదశి శుభాకాంక్షలు

ఈ పవిత్రమైన రోజున మీరు వెలిగించే దీపాలలాగే  మీ జీవితం కూడా  ప్రకాశవంతంగా మెరిసిపోవాలి. ధనత్రయోదశి శుభాకాంక్షలు

45
Asianet Image

ఈ రోజున మీరు చేసే పూజలతో లక్ష్మీదేవి మీకు ప్రేమ, శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ధనత్రయోదశి

ఈ ధనత్రయోదశితో మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోవాలి. అలాగే మీ జీవితం అంతులేని అవకాశాలు, శ్రేయస్సుతో నిండి పోవాలి. ధనత్రయోదశి శుభాకాంక్షలు!

ఈ ధనత్రయోదశి వెలుగు మీ జీవితంలో ఎనలేని ఆనందాన్ని అందించాలి. ప్రతి పనిలో మీరు విజయం సాధించాలని కోరకుంటూ హ్యాపీ ధనత్రయోదశి 

55
Asianet Image

బంగారం లాగే విలువైనది, వెండి లాగే స్వచ్ఛమైన ధనత్రయోదశి శుభాకాంక్షలు

ఈ ధనత్రయోదశికి లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులు మీ జీవితాన్ని సంపద, శ్రేయస్సుతో నింపాలి. ధంతేరాస్ శుభాకాంక్షలు!

ఈ పవిత్రమైన రోజున మీ సంపద రెట్టింపు కావాలి, మీ కష్టాలన్నీ మటుమాయం కావాలి. ధనత్రయోదశి శుభాకాంక్షలు!

ఈ ధనత్రయోదశికి వెలిగించే దీపాల వెలుగులు, గంటల శబ్దాలు మీ జీవితంలో సంతోషాన్ని, విజయాన్ని తీసుకురావాలి. ధనత్రయోదశి శుభాకాంక్షలు!
 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Nirjala Ekadashi: ఏకాదశి రోజున ఇలా చేస్తే, కోటి జన్మల పుణ్యం దక్కడం ఖాయం..!
Nirjala Ekadashi: ఏకాదశి రోజున ఇలా చేస్తే, కోటి జన్మల పుణ్యం దక్కడం ఖాయం..!
Garuda Purana: మరణానికి ముందే మనకు తెలిసిపోతుందా?
Garuda Purana: మరణానికి ముందే మనకు తెలిసిపోతుందా?
Spiritual: మనిషి చనిపోవడానికి ముందు ఇలా ఎందుకు జరుగుతుంది..?
Spiritual: మనిషి చనిపోవడానికి ముందు ఇలా ఎందుకు జరుగుతుంది..?
Top Stories