గరుడ పురాణం: రాత్రి పడుకునేముందు ఇవి చేస్తే శని ప్రభావం తప్పదు
గరుడ పురాణం ప్రకారం.. జీవితంలో మంచి ఉన్నత స్థానానికి వెళ్లాలి అంటే కొన్ని అలవాట్లు కచ్చితంగా మానుకోవాలి. ఈ అలవాట్ల కారణంగా ధనవంతులు కూడా పేదవారిగా మిగలపోతారట. మరి, ఆ తప్పులు ఏంటో చూద్దాం..
గరుడ పురాణం
హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది హిందూ ధర్మం ప్రాథమిక సూత్రాలను, తత్వశాస్త్రాన్ని వివరిస్తుంది. ఈ గరుడ పురాణం ప్రకారం.. దేవతలు దేవాయాల్లో మాత్రమే కాకుండా శరీరం, సమాజంలో ప్రతిచోటా ఉన్నారని చెబుతుంది. ఈ పురాణం మనకు జీవితం, మరణించిన తర్వాత జీవిత రహస్యాలను కూడా వివరిస్తుంది.
గరుడ పురాణం
సనాతన ధర్మంలోని 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ పురాణాలన్నీ మానవుని జీవనశైలి ఎలా ఉండాలో చెబుతాయి. మానవ ఆత్మలు, నరకం , భయంకరమైన శిక్షల గురించి సమాచారాన్ని అందిస్తాయి. వీటితో పాటు, ఈ పురాణం జీవితాన్ని పూర్తిగా ఎలా గడపాలి ? సరైన మార్గాన్ని ఎలా అనుసరించాలో వివరిస్తుంది. మన జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ పురాణంలో పేర్కొన్న నియమాలను మనం ఉపయోగించుకోవచ్చు.
మన ఇంటి నైరుతి దిక్కున టాయిలెట్ ఉండకూడదు.
గరుడ పురాణంలో, శ్రీ మహావిష్ణువు ప్రజలు తప్పనిసరిగా మానుకోవలసిన ఐదు అలవాట్లను వివరించారు. మీరు ఈ అలవాట్లను అనుసరిస్తే, మీరు ఖచ్చితంగా పేదరికంలోకి వెళతారు. మరి గరుడ పురాణంలో చెప్పిన అలవాట్లు ఏమిటి?
రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం, హిందూ శాస్త్రాల ప్రకారం, ఉదయం ఆలస్యంగా లేవడం చెడు అలవాటు. ఈ అలవాటు ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ ప్రగతి సాధించలేరు. ఇలాంటి వారు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని చెబుతుంది.
గరుడ పురాణం ప్రకారం, పడుకునే ముందు వంటగదిలో తిన్న ప్లేట్లు లేదా ఖాళీ వంట పాత్రలను అలాగే ఉంచి పడుకోకూడదు, ఇలా చేస్తే శని గ్రహంపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాకుండా, లక్ష్మీదేవి కోపగించుకుని ఇంట్లోకి ప్రవేశించదు. రాత్రి పడుకునే ముందు ఆ పాత్రలను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.