MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • వినాయకుడి ఈ 8 అవతారాలు ఎంతో ప్రత్యేకమైనవి.. వీటి సందేశమేంటో తెలుసా?

వినాయకుడి ఈ 8 అవతారాలు ఎంతో ప్రత్యేకమైనవి.. వీటి సందేశమేంటో తెలుసా?

Ganesh Chaturthi 2023: వినాయకుడి జన్మదినాన్నే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం.. ఈ పండుగను పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. విష్ణుమూర్తిలాగే వినాయకుడు కూడా రాక్షసులను వదించడానికి ఎనిమిది అవతారాలు ఎత్తాడు. ఒక్కో అవతారం మనకు ఒక్కో సందేశాన్ని ఇస్తుంది.  

2 Min read
Author : R Shivallela
Published : Sep 24 2023, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ganesh chaturthi 2023

ganesh chaturthi 2023

వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ఆచారాలతో పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపద కలుగుతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అయితే దేవుళ్లు, దేవతలు ఎన్నో అవతారాలు ఎత్తుతుంటారు. అలాగే వినాయకుడుదు కూడా ఎంతో మంది రాక్షసులను సంహరించడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడు. వినాయకుడి 8 అవతారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

1. ఏకదంత అవతారం

వినాయకుడికి ఒక దంతం మాత్రమే పూర్తిగా ఉంటుంది. మరొకటి విరిగిపోయి కొంచెం మాత్రమే ఉంటుంది. అందుకే ఈయనను ఏకదంతుడు అని పిలుస్తారు. ఈ అవతారంలో వినాయకుడు దేవతలను మాదాసురుడు అనే రాక్షసుని కోపము నుంచి విముక్తులను చేసాడు. ఏ విధమైన మత్తుకైనా సరే దూరంగా ఉండాలని ఈ వినాయకుని అవతారం మనకు బోధిస్తుంది.
 

39
ganesh chaturthi 2023

ganesh chaturthi 2023

2. దూమ్రవర్ణుడు

అహంకాసురుడిని సంహరించడానికి వినాయకుడు ఈ అవతారం ఎత్తుతాడు. ఈ అవతారంలో వినాయకుడి రంగు పొగలా ఉంటుంది. అందుకే దీనిని ధూమ్రవాణావతారం అంటారు. అహంకాసురుడు అహంకారానికి ప్రతీక. అందుకే వినాయకుడి ఈ అవతారం అహంకారం నుంచి విముక్తికి మార్గాన్ని చూపుతుంది.
 

49
ganesh chaturthi 2023

ganesh chaturthi 2023

3.లంబోదరుడు అవతారం

లంబోదరుడు అంటే పొడవైన లేదా పెద్ద కడుపు ఉన్నవాడని అర్థం. వినాయకుడు మనోహరసురుడిని సంహరించడానికి లంబోదరుడి అవతారం ఎత్తుతాడు. ఈ విధంగా వినాయకుడిని పూజించడం ద్వారా ఒక వ్యక్తి కోపాన్ని కూడా వదిలించుకోవచ్చు.

59

4. మహోదరుడు అవతారం

మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. దీంతో విఘ్నహర్త అయిన వినాయకుడు మహోదరుడు అవతారం ఎత్తవల్సి వస్తుంది. ఈ రూపంలో వినాయకుడు మహిషాసురుడిని వధించాడు. ఇక్కడ మహిషాసురుడి వధ  విముక్తికి చిహ్నం.

69

5. వక్రదంతుడు

మత్సర్యసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వినాయకుడు వక్రతుండ అవతారం ఎత్తుతాడు. మత్సర్యసురుడు అంటే ఇతరుల ఆనందాన్ని చూసిన రగిలిపోవడం. అయితే ఈ వినాయక అవతారం ఈ దుర్గుణం నుంచి విముక్తి సందేశాన్ని ఇస్తుంది.

 

79

6. వికటుడు

వినాయకుడు భీకర అవతారం ఎత్తి కామసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ రూపంలో వినాయకుడు నెమలిపై కూర్చుంటాడు. ఈ వినాయకుడి అవతారం మనకు కామం నుంచి విముక్తికి మార్గాన్ని చూపుతుంది.

89

7. గజానన అవతారం

ఈ అవతారంలో గణేశుడు లోభాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. లోభం అంటే దురాశ. చాలాసార్లు అత్యాశ వల్ల మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు. అందుకే గజానన అవతారం మనకు దురాశ నుంచి విముక్తి సందేశాన్ని ఇస్తుంది.
 

99
ganesh chaturthi 2023

ganesh chaturthi 2023

8. విఘ్నరాజు అవతారం

మామతాసురుడిని సంహరించడానికి వినాయకుడు విఘ్నరాజు అవతారం ఎత్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనంగా సింహం ఉంటుంది. పార్వతీ దేవి నవ్వు నుంచి మమతాసురుడు జన్మించాడు. 

About the Author

RS
R Shivallela
Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image2
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Recommended image3
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved