Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Spiritual
  • వినాయక చవితి 2023: వీటితో తయారుచేసిన వినాయకుడి విగ్రహాలను పూజిస్తే మీ బాధలన్నీ మాయం..!

వినాయక చవితి 2023: వీటితో తయారుచేసిన వినాయకుడి విగ్రహాలను పూజిస్తే మీ బాధలన్నీ మాయం..!

Ganesh Chaturthi 2023: హిందూ మతంలో  మొదటి ఆరాధ్యదైవంగా వినాయకుడిని పూజిస్తారు. వినాయక చవితి సందర్భంగా మట్టితో లేదా ఏకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించడం వల్ల ఆయన ఆశీస్సులు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Mahesh Rajamoni | Published : Sep 18 2023, 09:39 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

Ganesh Chaturthi 2023: కొన్ని చోట్ల సెప్టెంబర్ 18 అంటే ఈ రోజు, ఇంకొన్ని చోట్ల  సెప్టెబర్ 19 న వినాయక చవితిని జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లోనే కాకుండా.. ఇంటి గుడిలో కూడా వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. ఈ పండుగను పది రోజుల పాటు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే చాలా విగ్రహాలను పర్యావరణానికి హాని చేసే పదార్థాలతో తయారుచేస్తారు. అందుకే ఇలాంటి విగ్రహాలకు బదులుగా వేరే విగ్రహాలను ప్రతిష్టించాలని చెబుతున్నారు. మట్టి లేదా చెక్క వంటి ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను కూడా పొందుతారు. 
 

26
Asianet Image

ఆవు పేడతో తయారు చేసిన విగ్రహం

ఆవు పేడతో కూడా వినాయక విగ్రహాలను తయారుచేస్తారు. నిజానికి దీనితో తయారుచేసిన వినాయకుడి విగ్రహం కూడా మీకు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం.. ఆవు పేడను సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు. అందుకే ఇది మన ఇంటికి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే మట్టికి బదులుగా ఆవు పేడతో చేసిన వినాయక విగ్రహాన్నిమీ ఇంట్లో ప్రతిష్ఠించొచ్చు.

36
Asianet Image

చెక్క విగ్రహం.. 

మీరు ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటే రావి, మామిడి లేదా వేప చెక్కతో చేసిన విగ్రహాన్ని కొనండి. ఎందుకంటే హిందూమతంలో ఈ చెట్లకు, మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చెక్కతో చేసిన విగ్రహాన్ని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పై భాగంలో ప్రతిష్టించండి. మీకు అంతా మంచే జరుగుతుంది.
 

46
Asianet Image

చెక్క విగ్రహం.. 

మీరు ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటే రావి, మామిడి లేదా వేప చెక్కతో చేసిన విగ్రహాన్ని కొనండి. ఎందుకంటే హిందూమతంలో ఈ చెట్లకు, మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చెక్కతో చేసిన విగ్రహాన్ని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పై భాగంలో ప్రతిష్టించండి. మీకు అంతా మంచే జరుగుతుంది.
 

56
Asianet Image

పసుపు గణపతిని ఎలా తయారు చేయాలి?

పసుపుతో తయారుచేసిన వినాయక విగ్రహాన్ని కూడా ఇంట్లో  ప్రతిష్టించొచ్చు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ఇంట్లో పసుపుతో తయారుచేసని విగ్రహాన్ని తయారు చేసుకోవాలనుకుంటే ముందుగా పసుపును గ్రైండ్ చేసి నీరు కలిపి పిండిలా చేయండి. దీంతో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేయండి. 
 

66
Asianet Image

లోహంతో తయారు చేసిన విఘ్నేషుడి విగ్రహం

వినాయక పండుగ సమయంలో లోహంతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించొచ్చు. మీ ఇంట్లో బంగారం, వెండి లేదా ఇత్తడితో చేసిన వినాయక విగ్రహాన్ని కూడా ప్రతిష్టించొచ్చు.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories