Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • వినాయక చవితి 2023: వాస్తు ప్రకారం.. ఇంట్లో ఏ రంగు వినాయక విగ్రహాన్ని పెట్టడం మంచిది.. ఏ దిశలో పెట్టాలి?

వినాయక చవితి 2023: వాస్తు ప్రకారం.. ఇంట్లో ఏ రంగు వినాయక విగ్రహాన్ని పెట్టడం మంచిది.. ఏ దిశలో పెట్టాలి?

Ganesh Chaturthi 2023: వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి ముందు కొన్ని వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే..  

Mahesh Rajamoni | Published : Sep 16 2023, 02:46 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

Ganesh Chaturthi 2023: భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయకుడు అడ్డంకులను తొలగించేదేవుడుగా ఎంతో ప్రసిద్ధి చెందాడు. అందుకే ఏ పండగైనా, శుభకార్యమైనా వినాయకుడికే ముందు పూజ చేస్తారు. వినాయకుడి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా సక్రమంగా జరుగుతుందని నమ్ముతారు. అందుకే వినాయకుడిని పూజించకుండా ఏ శుభకార్యం సంపూర్ణం కాదు. ఇంట్లోని ప్రతికూలతలన్నింటినీ వినాయకుడు తొలగిస్తాడని కూడా నమ్ముతారు. అయితే వినాయకుడి విగ్రహాన్ని సరైన మార్గంలో ఉంచితే తప్ప ఇది సాధ్యం కాదంటున్నారు జ్యోతిష్యులు. మరి వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చే ముందు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

25
Asianet Image

వాస్తు ఇంటికి ఎలాంటి విగ్రహాలను తీసుకురావాలి? 

ఆవు పేడ, వేపచెట్టు, మర్రిచెట్టు తో చేసిన వినాయకుడి విగ్రహాలను ఇంటికి తేవడం వల్ల అదృష్టం పెరుగుతుంది. దురదృష్టం తొలగిపోతుంది. 

పసుపు, తెలుపు వినాయక విగ్రహాలు మీ అదృష్టాన్ని పెంచుతాయి. సిరి సంపదలను కలిగిస్తాయి.

స్ఫటిక వినాయక విగ్రహాలను ఇంటికి తీసుకురావడం వల్ల మీకున్న అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి. 
 

35
Asianet Image

వెండి వినాయక విగ్రహాన్ని తీసుకురావడం వల్ల మీ కీర్తి పెరుగుతుంది. 

ఇత్తడి వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకువాడం వల్ల మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 

చెక్క వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావడం వల్ల మీ సంతోసం పెరుగుతుంది.

45
Asianet Image

విగ్రహాన్ని ఉంచడానికి సరైన ప్రదేశం? 

వినాయక విగ్రహాలను ఎప్పుడూ కూడా తూర్పు, పడమర లేదా ఈశాన్య దిశలోనే ఉంచాలి. విగ్రహాన్ని దక్షిణ దిశలో లేదా మరుగుదొడ్డికి నేరుగా ఉన్న గోడకు లేదా మరుగుదొడ్డి సమీపంలో ఉంచకూడదు. అలాగే విగ్రహాన్ని మెట్ల కింద పెట్టడం కూడా మంచిది కాదు. 
 

55
Asianet Image

వినాయకుని తొండం స్థానం?

వాస్తు శాస్త్రం ప్రకారం.. వినాయకుడి తొండం కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉండాలి. ఎందుకంటే ఇది ఇంట్లో సానుకూలతను తెస్తుందని నమ్ముతారు.

ఒకవేళ మీరు మీ ఆఫీసు డెస్క్ పై వినాయకుడి విగ్రహాన్ని పెట్టాలనుకుంటే విగ్రహం నిలబడి ఉన్న స్థితిలో ఉందని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఇలాంటి విగ్రహం సానుకూల శక్తిని తెస్తుంది. అలాగే మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. 

ఇంట్లో వినాయక విగ్రహం స్థానం? 

మీరు ఇంటికి తీసుకువచ్చే వినాయక విగ్రహం కూర్చున్న భంగిమలో ఉండేలా చూసుకోండి.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Nirjala Ekadashi: ఏకాదశి రోజున ఇలా చేస్తే, కోటి జన్మల పుణ్యం దక్కడం ఖాయం..!
Nirjala Ekadashi: ఏకాదశి రోజున ఇలా చేస్తే, కోటి జన్మల పుణ్యం దక్కడం ఖాయం..!
Garuda Purana: మరణానికి ముందే మనకు తెలిసిపోతుందా?
Garuda Purana: మరణానికి ముందే మనకు తెలిసిపోతుందా?
Spiritual: మనిషి చనిపోవడానికి ముందు ఇలా ఎందుకు జరుగుతుంది..?
Spiritual: మనిషి చనిపోవడానికి ముందు ఇలా ఎందుకు జరుగుతుంది..?
Top Stories