MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Spiritual
  • గణేష్ చతుర్థి 2022: వినాయకుడి పుట్టుక వెనకున్న ఈ నిజాలు ఎంతమందికి తెలుసు..?

గణేష్ చతుర్థి 2022: వినాయకుడి పుట్టుక వెనకున్న ఈ నిజాలు ఎంతమందికి తెలుసు..?

గణేష్ చతుర్థి 2022:  ప్రతి ఏడాది వినాయక చవితి వస్తుంది. పోతుంది. అయితే ఈ పండుగను జరుపుకోవడం వెనకున్నఈ నిజాలు ఎంతమందికి తెలుసు..? 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 26 2022, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గణేష్ చతుర్థి 2022: ఏకదంతునికి ఏకంగా 108 పేర్లే ఉన్నాయి. అందులో ఒక్కొక్క పేరుకు ఒక్కో అర్థం కూడా ఉంది. అయినప్పటికీ ఈ జ్ఞానదేవుడిని గణపతి లేదా వినాయకుడనే పిలుస్తుంటారు. బొజ్జ వినాయకుడే శాస్త్రాలకు, కళలకు అధిపతి. అందుకే పండుగలు, వేడుకలకు వినాయకుడే ముందుగా పూజలందుకుంటాడు.  ఇక అసలు విషయానికొస్తే.. గణేషుడి పుట్టుకకు రెండు విభిన్న వెర్షన్లే ఉన్నాయి.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image: Getty Images

Image: Getty Images

ఒకటి: పార్వతీ దేవి స్నానం చేసే ముందు..పిండితో ఒక గణేషుడి బొమ్మను తయారుచేసి.. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కాపలాగా ఉంచుతుంది. అయితే పార్వతీ మాత స్నానం చేసే సమయంలోనే  బయటకెళ్లిని పరమేశ్వరుడు వస్తాడు. కాపాలగా ఉన్న గణేషుడికి శివుడు ఎవరన్న సంగతి తెలియదు. దీంతో శివుడిని లోపలికి వెళ్లకుండా అడ్డుపడతాడు. దీంతో ఇద్దరి మధ్య భీకర యుద్దం జరుగుతుంది. దీంతో పరమేశ్వరుడికి పట్టరాని కోపం వచ్చి గణేషుడి తలను నరుకుతాడు. ఈ సమయంలోనే పార్వతి బయటకొచ్చి.. అక్కడ జరిగిన దారుణాన్ని చూసి బోరున విలపిస్తుంది. ఎలాగైనా గణేషుడిని బ్రతికించమని శివుడిని కోరుతుంది. దాంతో శివుడు ఉత్తరాభిముఖంగా వెళ్లి ఒక ఏనుగు తలను తెచ్చి.. గణేషుడికి పెట్టి తిరిగి ప్రాణం పోస్తాడు. 

35
Image: Getty Images

Image: Getty Images

రెండోది:  దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు, పర్వతీమాత లు గణపతిని సృష్టించారని నమ్ముతారు. రాక్షసుల నుంచి వచ్చే అడ్డంకులను తొలగించేందుకు .. దేవతలకు సాయం చేయడానికి విఘ్నహర్తాను పుట్టించారని మరో పురాణం చెబుతోంది. విఘ్నహర్త అంటే ఇబ్బందులు అని.. హరత అంటే తొలగించేవాడని అర్థం. అందుకే గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకున్న బాధలు, సమస్యలన్నీ తొలగిపోతాయి. 
 

45
ganesh chaturthi 2022

ganesh chaturthi 2022

ఈ ఏడాది ఆగస్టు 31 న వినాయక చవితి వచ్చింది. ఈ పండున శుక్ల చతుర్థి నాడు ప్రారంభమవుతుంది. ఇక ఈ పండుగ సందర్భంగా వినాయక మండపాలన్నీ రంగురంగులతో శోభిల్లుతాయి. ఈ పండుగకు నాలుగు ప్రధాన ఆచారాలు ఉన్నాయి. ఒకటి ప్రాణప్రతిష్ట.. అంటే వినాయకుడికి విగ్రహాన్ని ప్రతిష్టించడం. రెండో షోడశోపచారం- గణేషుడికి నివాళులు అర్పించే 16 రూపాలు. మూడోది ఉత్తర పూజ- పూజ. నాలుగోది గణపతి విసర్జన-విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేయడం. 
 

55

ఈ పండుగను మరాఠా రాజు శివాజీ కాలం నుంచి జరుపుకుంటున్నారు. అయితే ప్రజా గణేషుడి విగ్రహాన్ని భౌసాహెబ్ లక్ష్మణ్ జావలే మొదటగా ప్రతిష్టించారు. అయితే మనదేశంలో పాటుగా థాయ్ లాండ్, ఇండోనేషియా, కంబోడియా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ వంటి దేశాల్లో కూడా గణేషుడిని ఆరాధిస్తారు.   

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved