MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • దసరా నాడు ఈ రెండు మొక్కలను పూజిస్తే మీ ఆర్థిక ఇబ్బందలున్నీ పోతాయి

దసరా నాడు ఈ రెండు మొక్కలను పూజిస్తే మీ ఆర్థిక ఇబ్బందలున్నీ పోతాయి

dussehra 2023: దసరా పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకే ఈ దసరా. అయితే ఈ రోజు రెండు మొక్కలను పూజించే ఆచారం కూడా ఉంది. 
 

R Shivallela | Published : Oct 21 2023, 02:29 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Asianet Image

dussehra 2023: హిందువులకు ఎంతో ముఖ్యమైన, మతపరమైన పండుగల్లో దసరా ఒకటి. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో శైభవంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రజలు ఈ రోజును స్మరించుకుంటారు. అంటే రావణునిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు అపరాజిత (శంఖు),  జమ్మి చెట్లను పూజించే ఆచారం కూడా ఉంది. దసరా రోజు ఈ రెండు మొక్కలను పూజిస్తే శ్రీరాముని అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు మన ఇంట్లో లక్ష్మీదేవి నివస్తుందని కూడా పండితులు చెబుతున్నారు. 
 

23
Asianet Image

శంఖు మొక్కను ఎలా పూజించాలంటే? 

దసరా రోజు శంఖు మొక్కపై పాలు, నీరు కలిపి పోయాలి. ఆ తర్వాత ఈశాన్య దిశలో అపరాజిత దేవిని పూజించాలి. ముందుగా ఈశాన్యం దిక్కు స్థలాన్ని శుభ్రం చేసి ఆవు పేడతో కప్పాలి జల్లాలి. అలాగే ఆ ప్రదేశాన్ని ముగ్గుతో అలంకరించాలి. అమ్మవారికి నైవేధ్యాన్ని సమర్పించి హారతితో పూజను ముగించాలి.

33
Vastu Plants

Vastu Plants

జమ్మి చెట్టును ఎలా పూజించాలి?

ఇంటికి ఈశాన్య దిశలో  జమ్మి మొక్కను నాటడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. దసరా రోజున దీన్ని ఇంట్లో నాటితే దాని ప్రభావం మరింత పెరుగుతుందంటారు పూజారులు. జమ్మి మొక్కను సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందుకే విజయదశమి రోజు జమ్మి మొక్క ముందు దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. విజయదశమి నాడు జమ్మి వృక్షం ఆకులను ఇంటికి తీసుకొస్తే మంచిదంటారు. 

R Shivallela
About the Author
R Shivallela
 
Recommended Stories
Top Stories