MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Life
  • Spiritual
  • గురువారం ఈ వస్తువులను దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు.. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది

గురువారం ఈ వస్తువులను దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు.. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది

ప్రతి గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈ రోజు విష్ణుమూర్తి పూజకు అంకితం చేయబడింది. అందుకే ఈ రోజు చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని వస్తువులను దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
 

R Shivallela | Published : Nov 02 2023, 10:21 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

హిందూ మతంలో.. శ్రీమహావిష్ణువును లోకరక్షకుడు అంటారు. ఈయన అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి బాధలైనా తొలగిపోతాయని నమ్ముతారు. కాగా ప్రతి గురువారం మహావిష్ణుమూర్తికి అంకితం చేయబడింది. అందుకే ఈ రోజున ఆయన భక్తులు నిష్టగా ఉపవాసం ఉండి, ఆయనను పూజిస్తారు. విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే ఈ రోజు కొన్ని వస్తువులను దానం చేయాలని పండితులు అంటున్నారు. దీనివల్ల వృత్తి నుంచి ఆర్థిక స్థితి పురోగతి వరకు ప్రయోజనాలను పొందుతారు. ఇందుకోసం ఎలాంటి వస్తువులను దానం చేయాలంటే? 
 

24
Asianet Image

పసుపు రంగు వస్త్రాలు

పసుపు రంగును శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన కలర్ గా భావిస్తారు. అందుకే విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి గురువారం నాడు ఉపవాసం ఉండి పసుపు రంగు దుస్తులు ధరించండి. అలాగే పేదలకు ఈ రంగు దుస్తులను కూడా దానం చేయండి. ఇది మీ జాతకంలో బృహస్పతి బలహీనమైన స్థానాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మీరు వృత్తిలో పురోగతిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. 
 

34
Asianet Image

వీటిని దానం చేయండి

గురువారం నాడు పసుపు రంగుకు చాలా ప్రత్యేకత ఉంది. విష్ణుమూర్తికి అంకితం చేయబడ్డ గురువారం పసుపు రంగును ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ రంగులో ఉండే ఎలాంటి ఆహారపదార్థాలైన అంటే పసుపు రంగు బియ్యం, అరటిపండ్లు, మిఠాయిలు వంటి వాటిని అవసరమైన వారికి దానం చేయండి. దీనివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. 
 

44
Asianet Image

వీటిని దానం చేయడం శుభప్రదం

విష్ణువుమూర్తి పూజలో పసుపును ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అందుకే ఈ రోజు మీరు పసుపు లేదా పసుపురంగు కాయధాన్యాలను కూడా దానం చేయొచ్చు. దీంతో విష్ణువుమూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే భక్తుల బాధలన్నింటీని విష్ణుమూర్తి పోగొడుతాడని నమ్ముతారు. అలాగే గురువారం నాడు మీ ఆర్థిక స్తోమత మేరకు పేదలకు వస్తువులను దానం చేస్తే చేయండి. దీంతో మీ సంపద పెరుగుతుంది. 
 

R Shivallela
About the Author
R Shivallela
ఆధ్యాత్మిక విషయాలు
 
Recommended Stories
Top Stories