Spiritual: సాయంత్రం వేళ ఈ పనులు చేస్తున్నారా.. అయితే దరిద్రం కొని తెచ్చుకున్నట్టే!
Spiritual: ఇల్లు సుఖసంతోషాలతో ఉండాలంటే వాస్తు శాస్త్ర నియమాలను తప్పకుండా పాటించాలి. వాస్తు నియమాలు పాటించకపోతే లేని దరిద్రం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. వాస్తు శాస్త్రం సాయంత్రం పూట ఈ పనులు చేయవద్దు అంటూ నిర్దేశించింది. అవి ఏమిటో చూద్దాం.
వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ డబ్బులు అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకూడదు. సాయంత్రం పూట ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిది. అలాగే సూర్యాస్తమయం తరువాత చీపురుతో ఇల్లు ఊడ్చకూడదు.
అలా చేయటం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఇది వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి పై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితులలోని సూర్యాస్తమయం తరువాత తులసి మొక్కలో నీరు పోయకూడదు. ఎందుకంటే తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థానం కాబట్టి నీరు పోయకండి.
అలాగే ఆ సమయంలో తులసి కోటని శుభ్రం చేయటం, ఆకులని తుంచటం వంటి పనులు చేయకూడదు. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. సాయంత్రం పూట తులసిని తాకకుండా దీపం పెట్టుకోండి. అలాగే సాయంత్రం తరువాత ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉంచకూడదు.
లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని, ఈ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచటం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తారు. అలాగే సాయంత్రం దాటిన తర్వాత స్త్రీలని తిట్టడం, వారితో చులకనగా మాట్లాడటం, వారితో గొడవకు దిగడం వంటివి చేయకూడదు.
ఇవి లక్ష్మీదేవికి అస్సలు ఇష్టంలేని పనులు కాబట్టి ఆ పనులు చేయకండి. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఎప్పుడూ గొడవ పడకండి. అలాగే సాయంత్రం దాటిన తర్వాత ఎవరైనా పేదవాడు మీ ఇంటికి వచ్చి ఏమైనా సాయం కావాలి అని అడిగితే అతనిని ఖాళీ చేతులతో పంపించకండి.
అలాగే సాయంత్రం తర్వాత పడుకోవడం నిషిద్ధం. ఆ సమయంలో నిద్ర పోవడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. అలాగే సంధ్యా సమయంలో గుమ్మం మీద ఇంటి ఆడపిల్లలు కూర్చోకూడదు దీని వలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఈ పనులు చేయకండి. చేసి కోరి దరిద్రాన్ని తెచ్చుకోకండి.