Crow: ఇంటి ముందుకు ఆ దిక్కులో కాకి వచ్చి అరిస్తే ఏమౌతుంది? దాని అర్థం ఏంటి?
Crow: కాకులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను సూచించే శకునాలుగా పరిగణిస్తారు. అందుకే, వాటి ప్రవర్తన, అరుపు, అవి కూర్చొనే దిశ కు కూడా ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

కాకి
హిందూ సంప్రదాయంలో కాకులు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థానాన్ని కలిగి ఉన్నాయి. భారతీయ పురాణాలు, వేదాలు, శకున శాస్త్రాలలో కాకుల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అంతేకాదు... మన సాంప్రదాయంలో కాకులను మన పితృ దేవతలుగా కూడా పరిగణిస్తారు. పితృపక్షంలో కాకులకు పిండం పెట్టడం మన పూర్వీకులను సంతృప్తి పరిచే కర్మగా పరిగణిస్తారు. మరి, కాకులను ఏ సమయంలో శుభ సూచికంగా భావిస్తారు..? ఏ సమయంలో అశుభంగా పరిగణిస్తారో తెలుసుకుందాం....
శుభ శకునాలు...
1.ఒంటరిగా కాకి అరవడం...
ఒక కాకి ఇంటి వాకిలి లేదా బాల్కనీలో కూర్చొని బిగ్గరగా అరుస్తుంటే, అది ఇంటికి అతిథులు రాబోతున్నారని సూచిస్తుంది. ముఖ్యంగా ఇది ఉదయం పూట జరిగితే, రోజంతా శుభవార్తలు వింటారు. సానుకూల సంఘటనలు కూడా జరగబోతున్నాయని అర్థం.
2.ఏ దిక్కున అరిస్తే శుభం..?
మధ్యాహ్న సమంలో కాకి ఉత్తరం లేదా తూర్పు దిశలో అరిస్తే... దానిని కూడా చాలా శుభ ప్రదంగా పరిగణిస్తారు. దీని వల్ల ఇంట్లో కి ధనం, సంతోషం రానున్నాయని అర్థం. అంతేకాదు పోటీల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని దాని సంకేతం.
3. ప్రయాణానికి ముందు:
మీరు ఇంటి నుండి బయలుదేరే ముందు కాకి అరుస్తే, ఆ ప్రయాణం విజయవంతమవుతుందని, అడ్డంకులు లేకుండా గమ్యానికి చేరుకుంటారని నమ్ముతారు.
4. నీరు త్రాగే దృశ్యం:
కాకి నీరు త్రాగడం లేదా ఆహారం తింటున్నట్లు కనిపిస్తే, అది శుభ సంకేతం. ఇది త్వరలో మీకు ఆర్థిక లాభం, పనిలో ప్రమోషన్ లేదా సంతోషకరమైన వార్త రాబోతుందని సూచిస్తుంది.
చెడు సంకేతాలు..
1. ఒకేసారి కాకులన్నీ అరిస్తే...
చాలా కాకులు కలిసి బిగ్గరగా అరుస్తుంటే, అది దురదృష్టానికి సంకేతం. ఈ సందర్భంలో కుటుంబంలో కలహాలు, అనారోగ్యం లేదా అశుభ సంఘటనలు జరగవచ్చని భావిస్తారు.
2. దక్షిణ దిశలో అరవడం:
దక్షిణ దిశలో కాకి అరుస్తే, అది పితృదోషం సూచనగా పరిగణిస్తారు. పూర్వీకుల ఆశీర్వాదం లభించడం లేదు అనేదానికి ఇది సంకేతం. ఈ పరిస్థితిలో పితృ తర్పణం చేయడం, కాకులకు పిండం పెట్టడం మంచిదని జ్యోతిష్యులు సూచిస్తారు.
3. చనిపోయిన కాకి:
ఇంటి ముందు లేదా ఆవరణలో చనిపోయిన కాకి కనిపిస్తే, అది అత్యంత దురదృష్టకరంగా పరిగణిస్తారు. ఈ సందర్భంలో శుద్ధి కర్మలు, దానం, ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా దోషాన్ని తగ్గించవచ్చు.
జ్యోతిష్య సంబంధం:
కాకులు శని గ్రహానికి ప్రతినిధులు. శనివారాల్లో కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని దోషం తగ్గుతుందని నమ్ముతారు. శని ప్రసన్నుడైతే మన జీవితంలో అడ్డంకులు తొలగి, కష్టాలు తగ్గుతాయి. అదేవిధంగా, రాహువు చెడు స్థితిలో ఉన్నప్పుడు కాకులకు ఆహారం పెట్టడం ద్వారా రాహువు ప్రభావం కూడా తగ్గుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
సాంస్కృతిక ప్రాముఖ్యత:
కాకుల గురించిన నమ్మకాలు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయాయి. ప్రతి గ్రామంలో, పట్టణంలో కూడా కాకులు ఒక ఆధ్యాత్మిక సంకేతాలుగా పరిగణిస్తారు.అందువల్ల, కాకులను గౌరవంగా చూడడం, వాటికి ఆహారం పెట్టడం, వాటి ప్రవర్తనను గమనించడం మన సాంప్రదాయంలో ఉన్న ఆధ్యాత్మిక అవగాహనను ప్రతిబింబిస్తుంది. శుభ శకునాలను అనుసరించడం, చెడు శకునాలను నివారించే చర్యలు చేయడం ద్వారా మన జీవితంలో శాంతి, ఆనందం , విజయాలు పొందవచ్చు.