MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • గురువారం ఈ పనులు చేస్తే మీ జీవితంలో డబ్బుకు కొరతే ఉండదు

గురువారం ఈ పనులు చేస్తే మీ జీవితంలో డబ్బుకు కొరతే ఉండదు

శ్రీ మహావిష్ణువును గురువారం నాడు పూజిస్తారు. ఈయన అనుగ్రహం పొందడానికి గురువారం స్నానం చేసి ధ్యానం చేయాలి. ఆ తర్వాత కొన్ని పనులను చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరతే ఉండదంటున్నారు జ్యోతిష్యులు. అవేంటంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 14 2023, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
lord vishnu 001

lord vishnu 001

ప్రతి గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజిస్తారు. గురువారం శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజు విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు దేవగురువు బృహస్పతిని కూడా పూజిస్తారు. గురువారం నాడు శ్రీవిష్ణువును పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు వృత్తి, వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి లాభాలను పొందుతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. గురువారం నాడు కొన్ని పరిహారాలు చేస్తే మీ ఆదాయం, అదృష్టం పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఏ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి మీరు గురువారం నాడు తలస్నానం చేసి ధ్యానం చేయండి. ఆ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి ముందుగా భాస్కరుడికి నీళ్లు సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీ నారాయణుడికి పూజ చేయండి. అయితే పూజ సమయంలో విష్ణుమూర్తికి అష్టదళ తామరను సమర్పించాలని పూజారులుచెబుతున్నారు. దీనివల్ల మీరు విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. దీంతో మీరు కోరుకున్న పనులను పూర్తి చేస్తారు. 

35

2. మీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేకపోతే గురువారం పూజ సమయంలో శ్రీవిష్ణువుకు కొబ్బరికాయను సమర్పించండి. అలాగే దేవుడికి మొక్కుతూ సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, ఐశ్వర్యం కలగాలని కోరుకోండి. ఆ తర్వాత కొబ్బరికాయను ఎరుపు లేదా పసుపు వస్త్రంలో చుట్టి సురక్షితంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

45

3. గురువారం నాడు తలస్నానం చేసిన తర్వాత కాసేపు ధ్యానం చేయండి. ఆ తర్వాత ఆచారాలతో శ్రీమహావిష్ణువును పూజించండి. పూజసమయంలో విష్ణుమూర్తికి కుంకుమపువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయండి. ఈ పరిహారం వల్ల దేవుడి అనుగ్రహం పొందుతారు. దీంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. 
 

55

4. మీ వృత్తి లేదా వ్యాపారంలో మంచి లాభాలను పొందడానికి, సమస్యలను పోగొట్టాలంటే గురువారం నాడు మీ సమీపంలోని లక్ష్మీ నారాయణ ఆలయాన్ని సందర్శించండి. అలాగే శ్రీవిష్ణువును పూజించండి. అలాగే లక్ష్మీదేవికి, సంపదకు అధిదేవత అయిన విష్ణుమూర్తికి 7 పసుపు ముద్దలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image2
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Recommended image3
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved