తులసి చెట్టు దగ్గర ఈ వస్తువులను పొరపాటున కూడా పెట్టకండి.. లేదంటే ఇంట్లో పేదరికమే..!
తెలిసో తెలియకో మనం ఎంతో పవిత్రంగా భావించే తులసి చెట్టు దగ్గర కొన్ని వస్తువులను పెడుతుంటాం. కానీ దీనివల్ల మీ జీవితంపై చెడు ప్రభావం పడుతుంది.
హిందూ మతంలో తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే చాలా మంది తులసి చెట్టుకు పూజ చేస్తారు. ఈ మొక్క ఉంటే ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. అంతేకాదు ఈ మొక్కవల్ల సంపాదన బాగుంటుందని నమ్ముతారు. తులసి మొక్కలో సుఖ సంతోషాలకు, సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఉనికి ఉందని నమ్ముతారు. అందుకే తులసి చెట్టు విషయంలో కొన్ని నియమాలను పాటించాలి.
అయితే తులసిని పూజించడే కాకుండా.. తులసి మొక్క దగ్గర కొన్ని వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు. ఇలా పెడితే మీ జీవితంపై చెడు ప్రభావం పడుతుంది. మరి తులసి చెట్టు దగ్గర ఎలాంటి వస్తువులను పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
డస్ట్ బిన్
జ్యోతిష్యుల ప్రకారం.. తులసి మొక్క దగ్గర డస్ట్ బిన్ లేదా చీపురును ఉంచకూడదు. ఎందుకంటే ఇది అశుభంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇవి ఈ మొక్క చుట్టూ ఉన్న స్వచ్ఛత, శక్తికి భంగం కలిగిస్తుంది. తులసి మొక్క చుట్టూ డస్ట్ బిన్ లేదా చీపురును పెట్టడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రభావం పెరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అందుకే తులసి మొక్క పరిసరాలను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి.
వినాయకుడి విగ్రహం
వాస్తు ప్రకారం.. తులసి మొక్క దగ్గర వినాయకుడి విగ్రహాన్ని అసలే పెట్టకూడదు. అంతేకాదు విఘ్నేషుడి పూజకు తులసి ఆకులను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది అశుభంగా పరిగణించబడుతుంది.
శివలింగం
వాస్తు ప్రకారం.. తులసి మొక్క దగ్గర శివలింగం లేదా భోళాశంకరుడి విగ్రహాన్ని మంచడం మంచిది కాదు. అందుకే పొరపాటున కూడా శివలింగాన్ని లేదా శివుడి ఫోటోను పెట్టకండి. అలాగే తులసి ఆకులను శివారాధనలో కూడా ఉపయోగించకూడదు.
చెప్పులు, బూట్లు
తులసి ఎంతో పవిత్రమైన మొక్క. అందుకే ఈ మొక్క చుట్టూ చెప్పులు, బూట్లను పెట్టకూడదు. దీన్ని అగౌరవంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు వస్తాయి.
ముళ్ల మొక్కలు
తులసి మొక్క దగ్గర ముళ్ల మొక్కలను పొరపాటున కూడా నాటకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది అనుకూలంగా పరిగణించబడదు. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది.