MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • దీపావళి రోజు కూడా ఉపవాసం ఉంటారు.. దీని వెనుకున్న చరిత్ర తెలుసా?

దీపావళి రోజు కూడా ఉపవాసం ఉంటారు.. దీని వెనుకున్న చరిత్ర తెలుసా?

Diwali 2023: దీపావళికి లక్ష్మీదేవిని, వినాయకుడుని పూజిస్తే జీవితంలోని అన్ని బాధలు తొలగిపోయి సిరి, సంపదలు, కీర్తి, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఈ రోజున ఆడవారు ఉపవాసం కూడా ఉంటారు. ఎందుకంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 04 2023, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Diwali 2023: దీపావళి పండుగను ఎంతో పవిత్రమైన పండుగగా పరిగణిస్తారు. అందుకే ఈ పండుగ సందర్భంగా ఇంటినంతా శుభ్రం చేసి పాత, పనికిరాని వస్తువులన్నింటినీ ఇంట్లోంచి తీసేస్తారు. అలాగే విరిగిపోయిన దేవుళ్ల విగ్రహాలను కూడా తొలగిస్తారు. కొత్త లక్ష్మీదేవి విగ్రహాలను కొంటుంటారు. అంతేకాదు ఈ పండుగ సందర్భంగా తమ బాధలు, కష్టాలన్నీ తొలగిపోవాలని చాలా మంది ఆడవారు ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు. కానీ దీపావళి ఉపవాసం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. 
 

24

దీపావళికి ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. తర్వాత తలస్నానం చేసి ఇంటిని, ఇంటి దేవాలయాన్ని శుభ్రం చేస్తారు. కొత్తబట్టలు ధరించి లక్ష్మీదేవికి దీపం వెలిగించి పూజ చేస్తారు. మరి ఈ ఉపవాసం ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
 

34

దీపావళి ఉపవాసం కథ

పురాణాల ప్రకారం.. ఒకసారి లక్ష్మీదేవి కార్తీక మాసం అమావాస్య రోజు వైకుంఠధామం నుంచి భూలోకానికి వస్తుంది. అమవాస్య కారణంగా చుట్టూ చీకటిగా ఉండటంతో ఆమె తిరిగి వెళ్లేందుకు దారి తప్పుతుంది. దీంతో అమ్మవారు ఆ రాత్రి భూలోకంలోనే ఉండి సూర్యోదయం తర్వాత వైకుంఠధామానికి వెళదామని అనుకుంటుంది. అయితే రాత్రి పొద్దుపోవడంతో అందరూ తలుపులు మూస్తారు. అయితే అమ్మవారికి దూరం నుంచి ఒక ఇంటి తలుపులు తెరిచి, దీపం వెలిగించిన ఇళ్లు కనిపిస్తుంది. దీంతో అమ్మవారు ఆ ఇంటికి వెళుతుంది. లోపలికి వెళ్లడానికి ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలి అనుమతితో ఆ రాత్రంతా అమ్మవారు అక్కడే ఉంటుంది. అయితే ఆ  వృద్ధురాలు నిద్రలేచేసరికి అమ్మవారు ఉండదు. అలాగే చిన్న ఇళ్లు రాజభవనంలా మారుతుంది. అంతేకాదు ఆ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు, రత్నాలు, ధాన్యం, నగలే కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి.
 

44

అమావాస్య రాత్రి దీపం వెలిగించడం
    
కార్తీక అమావాస్య రోజు రాత్రి ప్రతి ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదమని జ్యోతిష్యులు చెప్తారు. ఈ రోజు తలుపులు తెరిచి  ఉంచడం వల్ల లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం.. దీపావళి నాడు ఉపవాసం ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
దీపావళి
Latest Videos
Recommended Stories
Recommended image1
Ugadi Festival 2026: ఉగాది రోజున ఈ ఒక్క పని చేయకపోతే… ఏడాది మొత్తం ప్రభావం పడుతుందా?
Recommended image2
Dosa Prasadam: ఈ గుడిలో ప్రసాదంగా దోశలు పెడతారు.. ఆ దోశ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Recommended image3
Ugadi Festival 2026: ఉగాది రోజు పూజ ఎప్పుడు చేయాలి? పండితులు చెప్పిన శుభ మూహుర్తం ఇదే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved