MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • దీపావళి రోజు 13 దీపాలను ఎందుకు వెలిగిస్తారు.. దీని వెనకున్న రహస్యం తెలుసా?

దీపావళి రోజు 13 దీపాలను ఎందుకు వెలిగిస్తారు.. దీని వెనకున్న రహస్యం తెలుసా?

diwali 2023: దీపావళి పండుగ ప్రతి భారతీయుడికి ఎంతో ప్రత్యేకమైంది. దీపాలు లేకుండా ఈ దీపావళి పండుగ అసంపూర్ణం. దీపావళి నాడు దీపాలను వెలిగించడమనేది సాంప్రదాయంగా వస్తోంది. అలాగే దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే దీపాలు మనల్ని ఎన్నో ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తాయి. అయితే దీపావళి పండుగ నాడు చాలా మంది 13 దీపాలను ఖచ్చితంగా వెలిగిస్తారు. ఎందుకంటే? 

2 Min read
Author : R Shivallela
Published : Nov 03 2023, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

diwali 2023: మనం జరుపుకునే ముఖ్యమైన, పవిత్రమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను దీపాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే చీకటిపై వెలుగు సాధించిన విజయానికి  ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది కాబట్టి. అందుకే ఈ పండుగ ఇండియన్స్ కు ఎంతో ప్రత్యేకమైంది. ఈ పవిత్రమైన రోజున భక్తులు లక్ష్మీదేవితో పాటుగా వినాయకుడిని కూడా పూజిస్తారు. సుఖ శాంతులతో దీవించమని అమ్మవారిని వేడుకుంటారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

దీపావళి పండుగ దీపాలు లేకుండా అసంపూర్ణమే అవుతుంది. అవును దీపావళి పండుగకు ఖచ్చితంగా దీపాలను వెలిగించాలనే సాంప్రదాయం ఉంది. జ్యోతిష్యుల ప్రకారం.. ఈ దీపాలు ప్రతికూల శక్తుల నుంచి కాపాడుతాయి. అయితే ఈ పండుగకు చాలా మంది 13 దీపాలను వెలిగిస్తారు. ఇలా ఇన్ని దీపాలనే ఎందుకు వెలిగిస్తారు? దీనివెనుకున్న రహస్యమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
 

35

మొదటి దీపం:  13 మూడు దీపాల్లో మనం ముందుగా వెలిగించే దీపం మనల్ని, మన కుటుంబాన్ని అకాల మరణం నుంచి కాపాడుతుంది. 13 దీపాలను ధనత్రయోదశి నాడు దక్షిణ దిశలో వెలిగించాలి. అది కూడా ఇంటి బయట.

రెండో దీపం: రెండో దీపం శుభాలు కలగడానికి వెలిగిస్తారు. దీపావళి రాత్రి నెయ్యితో దీపాన్ని వెలిగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ దీపాన్ని మీ ఇంట్లోని అనువైన చోట పెట్టాలి. 

మూడో దీపం: మూడో దీపం లక్ష్మీదేవి ముందు వెలిగించాలి. తర్వాత సంపద, శ్రేయస్సు, విజయాలు కలగాలని అమ్మవారిని వేడుకోవాలి. 
 

45

నాలుగో దీపం: ఈ దీపాన్ని తులసి మొక్క ముందు వెలిగించాలి. దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. 

ఐదో దీపం:  ఈ దీపాన్ని మీ ఇంటి ద్వారం ముందు పెట్టాలి. ఈ దీపం మీ ఇంటికి ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది. అలాగే ఇంట్లో సంతోష వాతావరణాన్ని కలిగిస్తుంది. 

ఆరో దీపం: ఆరో దీపాన్ని రావిచెట్టు కింద పెడతారు. ఈ దీపాన్ని ఆవనూనెతో వెలిగించాలి. ఈ దీపం ఆరోగ్య, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

ఏదో దీపం: ఈ దీపాన్ని ఆలయంలో వెలిగిస్తారు. 

55
diwali 2023 kab hai

diwali 2023 kab hai

ఎనిమిదో దీపం: ఎనిమిదో దీపాన్ని డస్ట్ బిన్ దగ్గర వెలిగిస్తారు. ఈ దీపం ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను తిరిమికొడుతుందనే నమ్మకం.

తొమ్మిదవ దీపం: మన జీవితంలో సానుకూల శక్తిని తీసుకురావడానికి తొమ్మిదవ దీపాన్ని వెలిగిస్తారు. 

పదవ దీపం: ఈ దీపం ప్రతికూల శక్తి నుంచి మనకు రక్షణగా నిలుస్తుంది. దీన్ని ఇంటి పైకప్పుపై వెలిగిస్తారు.

పదకొండవ దీపం: ఈ దీపం దుష్ట శక్తులతో పోరాడేందుకు  సహాయపడుతుంది. దీన్ని ఇంట్లో కిటికీ దగ్గర పెడతారు. 

పన్నెండవ దీపం: ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని ఇంటి పై అంతస్తులో పెడతారు. 

About the Author

RS
R Shivallela
దీపావళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Recommended image2
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Recommended image3
Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved