MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • దీపావళి పూజలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు

దీపావళి పూజలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు

Diwali  2023: దీపావళి నాడు లక్ష్మీదేవికి నిష్టగా పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి... ఇంట్లో సిరి, సంపదలు వెల్లివిరుస్తాయనే నమ్మకం ఉంది. అయితే లక్ష్మీదేవి పూజలో కొన్నితప్పులు చేస్తే మీకు పూజ చేసిన ఫలితం కూడా ఉండదు. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 04 2023, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దీపావళి పండుగ సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందుకే ఈ రోజున అందరూ నిష్టగా అమ్మవారికి పూజలు చేసి, తల్లి ఆశీర్వాదం పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని, ఆర్థిక సమస్యలే రావని నమ్మకం ఉంది. అందుకే ఈ రోజు అమ్మవారి అనుగ్రహం పొందడానికి దీపాలను వెలిగిస్తారు. అలాగే ఇంటిముందు అందమైన రంగును వేస్తారు. అంతేకాదు ఇంటినంతా శుభ్రంగా ఉంచుతాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి అమ్మవారు వస్తుందని నమ్ముతారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీపావళి రోజున చేసే పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దీపావళి నాడు పూజ సరిగ్గా చేస్తే మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. అలాగే మనలో చాలా మంది పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇవి చిన్న తప్పులే అయినా.. పూజా ఫలితం దక్కకుండా చేస్తాయి. ఇంతకీ దీపావళి పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

36

లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలు సరైన దిశలో.. 

దీపావళి రోజూ పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను సరైన దిశలోనే పెట్టాలి. కానీ చాలా మంది పూజ హాడావుడిలో ఉండి ఈ విషయాన్నే పట్టించుకోరు. జ్యోగిష్యలు ప్రకారం.. ఈ దేవుళ్ల విగ్రహాలను సరైన దిశలో పెట్టకుంటే మీపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీపావళి పూజకోసం లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను మీ ఇంటి ఈశాన్య మూలలో పెట్టండి. ఈ దిశలోనే దేవతలు నివసిస్తారని నమ్ముతారు.

46

చెక్క స్టూల్
 
చాలా మంది లక్ష్మీదేవి విగ్రహాన్ని బాక్సులు లేదా ఫ్యాన్సీ ట్రేలపై పెడతారు. కానీ అమ్మవారి విగ్రహాన్ని చెక్క స్టూల్ మీదే పెట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ స్టూల్ పై ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గుడ్డను పరిచి అమ్మవారి విగ్రహాన్ని పెట్టాలి. పూజ స్టార్ట్ చేసే ముందు గంగాజలం లేదా పవిత్ర జల తీసుకొని మీ ఇంటి అన్ని మూలల్లో జల్లండి. 
 

56

అలంకరణ

విగ్రహాలను నేరుగా చెక్క స్టూల్ పై పెట్టకూడదు. స్టూల్ పై ఎర్రని గుడ్డను పరిచిన తర్వాత కొన్ని గులాబీ రేకులతో దాన్ని అలంకరించండి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. దీనిపై కొత్తిమీర ఆకులను ఉంచడం కూడా శుభప్రదంగా భావిస్తారు. 
 

66

సరైన పూజా సామాగ్రి

దీపావళి పూజలో లక్ష్మీదేవి, గణేశుడి విగ్రహాలను పక్క పక్కన పెట్టకుండా పూజ చేయకూడదు. ఈ పూజలో ఒక కలశాన్ని తీసుకుని దానికి పచ్చి పసుపు, వెండి నాణెం, బియ్యం, పువ్వులు, మామిడి ఆకులతో అలంకరించండి. దీన్ని వెండి గిన్నెతో కప్పి ఎరుపు రంగు వస్త్రంలో చుట్టిన కొబ్బరికాయను కుండపై ఉంచితే శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరికాయ మీకు ఎదురుగా ఉండే విధంగా పెట్టాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
దీపావళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Recommended image2
Bommala Koluvu Decoration : ఈ నవరాత్రికి బొమ్మల కొలువును ఇలా ప్లాన్ చేయండి..అదిరిపోయే డెకరేషన్ ఐడియాస్
Recommended image3
Van Devi Temple: సాయంత్రమైతే ఈ ఆలయానికి నో ఎంట్రీ.. 400 ఏళ్ల నాటి గుడి కథేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved