MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • దీపావళి నాడు మీరు ఈ జీవులను చూస్తే అదృష్టవంతులే..!

దీపావళి నాడు మీరు ఈ జీవులను చూస్తే అదృష్టవంతులే..!

Diwali 2023 : దీపావళి పండుగను భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను దీపోత్సవం అంటే దీపాల పండుగ అని కూడా అంటారు. ఈ రోజు లక్ష్మీదేవితో పాటుగా వినాయకుడిని కూడా పూజిస్తారు. అయితే పవిత్రమైన దీపావళి పర్వదినాన మీరు కొన్ని జీవులను చూస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. 
 

Shivaleela Rajamoni | Published : Nov 07 2023, 05:32 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

Diwali 2023 : ఈ ఏడాది  దీపావళి పండుగను నవంబర్ 12 అంటే ఆదివారం నాడు జరుపుకోబోతున్నాం. ఈ రోజు లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే మన ఇంట్లో అమ్మవారు నివసిస్తారని ప్రతీతి. అలాగే దీపావళి రోజు లక్ష్మీదేవి సంతోషంగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపిస్తాయట. అంటే ఈ రోజు మీరు కొన్ని జీవులను చూస్తే మీకు అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే? 
 

24
Lizard at home

Lizard at home

ఇది శుభసూచకం

బల్లులు సాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటాయి. అయితే పవిత్రమైన దీపావళి పండుగ నాడు రాత్రి గణేష్-లక్ష్మీ పూజ తర్వాత వీటిని చూడటం శుభప్రదంగా,  పవిత్రంగా భావిస్తారు. దీపావళి రోజున బల్లిని చూడటం అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతోందని సంకేతమంటున్నారు జ్యోతిష్యులు. అలాగే దీపావళి నాడు రాత్రిపూట గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి సంతోషంగా ఉందని అర్థమట.

34
Asianet Image

పిల్లి

శకున శాస్త్రం ప్రకారం.. ఇంట్లోకి పిల్లి రావడం చాలా శుభప్రదం. ఒకవేళ దీపావళి నాడు మీరు పిల్లిని చూస్తే అది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే దీన్ని లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు. చూసిన వ్యక్తికి ధనలాభం కలుగుతుందని నమ్ముతారు. 

44
Asianet Image

చీమ 

దీపావళి రోజు మీ ఇంట్లో నల్ల చీమను చూడటం కూడా శుభసూచికమే. మీ ఇంట్లో బంగారు వస్తువులు ఉంచిన చోట నల్ల చీమలు కనిపిస్తే మీ సంపద పెరుగుతుందని అర్థం. అలాగే మీ ఇంటి పైకప్పు నుంచి చీమలు బయటకు రావడం కూడా శుభసూచకమే. అంటే మీకు ఆకస్మిక డబ్బు కలుగుతుంది.
 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories