MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Spiritual
  • శివలింగం, జ్యోతిర్లింగం.. ఏది పవర్‌ఫుల్‌

శివలింగం, జ్యోతిర్లింగం.. ఏది పవర్‌ఫుల్‌

శివలింగం వేరు.. జ్యోతిర్లింగం వేరు అని మీకు తెలుసా.. ప్రతి శివాలయంలో ఉండేది జ్యోతిర్లింగం కాదు. కాశీ, శ్రీశైలం, వంటి పుణ్యక్షేత్రాల్లో ఉండేవి మాత్రమే జ్యోతిర్లింగాలు. ఇలాంటివి మన  దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలున్నాయి. మరి శివలింగం, జ్యోతిర్లింగంలలో ఏది శక్తివంతమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Aug 29 2024, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి ఊరిలో శివాలయం ఉండాలని హిందూ ధర్మంలో ఉంది. చిన్నదో, పెద్దదో శివాలయం ఉండకుండా ఏ ఊరు ఉండదు. అలాంటి ఊర్లేమైనా ఉంటే వాటిని శ్మశానంగా చూసేవారు. అందుకే పూర్వం రాజులు, చక్రవర్తులు ఊరూరా శివాలయాలు నిర్మించేవారు. శాతవాహనులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు ఇలా ఎంతో మంది వారి పరిపాలనా కాలంలో అనేక ఆలయాలను నిర్మించారు.  శివలింగాలను వివిధ రకాల వస్తువులతో తయారు చేస్తారు. ఎక్కువగా నల్ల రాతితో చేస్తారు. ఉత్తర భారత దేశంలో పాలరాయిని కూడా ఉపయోగిస్తారు. ఇళ్లలో పూజించే శివలింగాలను వారి ఆర్థిక స్థితి మేరకు బంగారం, వెండి, రాగి, మట్టితోనూ తయారు చేయించి పూజిస్తుంటారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

శివలింగం అంటే హిందూ ధర్మంలో శివుని ప్రతిరూపం. ఇది శివుని నిరాకార స్వరూపాన్ని సూచిస్తుంది. శివలింగం సాధారణంగా ప్రతి శివాలయంలో కనబడుతుంది. ఇవన్నీ ప్రతిష్ఠించిన విగ్రహాలు. శివలింగాలను పూజించడం ద్వారా భక్తులు శివుని అనుగ్రహం పొందుతారు. శివలింగం ఎంత పరిమాణంలోనైనా ఉండవచ్చు. అది చిన్నదైనా, పెద్దదైనా శివలింగమే. ఇది శివుని నిర్వికల్ప, నిరాకార, నిర్గుణ స్వరూపాన్ని సూచిస్తుంది.
 

36

జ్యోతిర్లింగం అంటే ఆకాశంలో వెలుగుతో ఉన్న లింగం అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం, శివుడు స్వయంగా వెలిగించిన అద్భుతమైన శక్తి కేంద్రం జ్యోతిర్లింగం అని చెబుతారు. జ్యోతిర్లింగాలు చాలా శక్తివంతమైనవి. శక్తి కేంద్రాలుగా వెలుగొందే ఈ క్షేత్రాలకు వెళితే మనలో ఉండే నెగిటివిటీ పోయి పాజిటివ్‌ వైబ్రేషన్‌ పెరుగుతాయని పండితులు చెబుతారు. ఈ జ్యోతిర్లింగాలను దర్శించడం ద్వారా భక్తులు శివుడిని ప్రత్యక్షంగా చూపినట్లు భావిస్తారు.

46

జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి. అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. 
1. రామనాథస్వామి లింగం - రామేశ్వరం
2. శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం) - శ్రీశైలం
3. భీమశంకర లింగం - భీమా శంకరం
4. ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం - ఎల్లోరా గుహలు
5. త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్)
6. సోమనాథ లింగం - సోమనాథ్
7. నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక)
8. ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం
9. మహాకాళ లింగం - ఉజ్జయిని
10. వైద్యనాథ జ్వోతిర్లింగం - చితా భూమి (దేవఘర్)
11. విశ్వేశ్వర లింగం - వారణాశి
12. కేదార్‌నాథ్‌ ఆలయం

56

అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగం
12 జ్యోతిర్లింగాలలో వారణాశిలోని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం అన్నింటికంటే శక్తివంతమైన, పవిత్రమైన జ్యోతిర్లింగంగా భక్తులు నమ్ముతారు.  భారతదేశంలోని పురాతన, పవిత్రమైన నగరాల్లో కాశీ ముఖ్యమైనదని విశ్వాసం. విశ్వనాథుడు విశ్వానికి అధిపతిగా పురాణ కథల్లో ఉంది.  కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఒక్కసారి సందర్శించి, గంగాస్నానం చేస్తే గత జన్మ పాపాలు పోతాయని ప్రజల విశ్వాసం. 

66

ఏది పవర్ ఫుల్

శక్తి పరంగా చూస్తే జ్యోతిర్లింగాలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణిస్తారు. ఎందుకంటే జ్యోతిర్లింగాలను సాక్షాత్తు శివుడే వెలిగించాడని నమ్ముతారు. ఆ క్షేత్రాలు పరమ శివునికి ప్రతి రూపాలని నమ్ముతారు. పురాణాల ప్రకారం జ్యోతిర్లింగాల పూజ, యాత్రలు చేసిన భక్తులు అద్భుతమైన అనుభవాలు పొందారు. ఈ ఉదంతాలు కథల రూపంలో అందుబాటులో ఉన్నాయి. శివలింగం, జ్యోతిర్లింగం రెండింటికీ శక్తి ఉన్నప్పటికీ జ్యోతిర్లింగాలు ఎక్కువ పవర్‌ఫుల్‌.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved