దేవాలయాలకు వెళ్ళినప్పుడు వెనుకభాగాన్ని అస్సలు తాకకూడదు.. ఎందుకో తెలుసా?
దేవాలయాలకు (Temples) వెళ్లి స్వామిని నమస్కరించుకుని మనసులోని కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. భగవంతుడిని నమస్కరించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని కూడా తాకి నమస్కరించుకుంటారు. కానీ శాస్త్రం ప్రకారం దేవాలయం వెనుక భాగాన్ని తాకరాదు (Do not touch) అని చెబుతోంది. ఎందుకు తాకరాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు (Monsters) కొలువై ఉంటారు. కాబట్టి ఆ భాగంలో మనం తాకితే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది. రాక్షసుల నెగిటివ్ వైబ్రేషన్స్ (Negative Vibrations) మనపై ఉండి గుడికి వెళ్ళిన పుణ్యం కన్నా సత్ఫలితాలను పొందలేక అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
మనసులోని కోరికలు (Desires) నెరవేరవు. అనుకున్న పనులు సకాలంలో జరగవు. కాబట్టి భగవంతున్ని దర్శనం చేసుకున్నాక తర్వాత ప్రదక్షిణలు చేసే ప్రతి ఒక్కరు దేవాలయానికి కొంచెం దూరంలో ప్రదక్షిణలు చేయడం మంచిది. అలాగే దేవాలయానికి ఆనుకుంటూ, పట్టుకుంటూ (Holding) ప్రదక్షిణలు చేయరాదు. శాస్త్రం ప్రకారం గుడికి వెనుక భాగాన్ని రాక్షసుల స్థానంగా భావిస్తారు. కనుక దేవాలయం వెనుక భాగాన్ని తాకరాదు.
దేవాలయానికి దూరంగా ప్రదక్షిణలు చేయడం మంచిదని శాస్త్రం (Science) చెబుతోంది. అలాగే దేవాలయంలో స్వామివారిని నమస్కరించుకునే సమయంలో ఎదురుగా (Opposite) కూడా నిల్చోరాదు. ఒక పక్కకి తిరిగి స్వామివారిని నమస్కారం చేసుకోవాలి. అప్పుడే ఆ స్వామివారి ఆశీస్సులు మనపై ఉండి అనుకున్న పనులు నెరవేరుతాయి. స్వామివారి అనుగ్రహం మన పైన ఉంటుంది.
గుడికి వెళ్ళిన పుణ్యఫలం దక్కుతుంది. అలాగే శివాలయంలో (Shiva temple) నందీశ్వరునికి స్వామివారికి మధ్యలో నిల్చొని చాలామంది నమస్కరించుకుంటారు. అయితే ఈ విధానం శాస్త్రం ప్రకారం సరైనది కాదు. భగవంతుడిలో కొన్ని వేల రెట్ల శక్తి తరంగాలు (Energy waves) ఇమిడి ఉంటాయి. వీటిని భరించగల శక్తి మనలో ఉండదు.
కనుక భగవంతుడు చాలా శక్తివంతమైన శక్తులను కలిగి ఉంటాడు. కనుక పక్క నుండి స్వామివారిని నమస్కరించి, స్వామివారిని చూసి మనసులో నిలుపుకోవాలి. భగవంతున్ని నియమనిష్టలతో స్మరించుకోవాలి. అప్పుడే స్వామివారి అనుగ్రహాన్ని (Grace) పొందగలుగుతారు. భగవంతుని దర్శన భాగ్యం అయినందుకు సంతోషించి మనసుని ప్రశాంతంగా (Calm down) ఉంచుకుంటే మనలోని సంకల్పాలు నెరవేరుతాయి.
అన్నింటిలోను విజయాలు కలిగేందుకు ఆ స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు వెన్ను (Back) చూపరాదని అంటారు. భగవంతున్ని దర్శించుకుంటే ఆయురారోగ్యాలతో (Longevity) పాటు భగవంతుడి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి. అలాగే దేవుని దర్శనం అయిన తరువాత తిరిగి ఇంటికి వచ్చే సమయంలో గుడిలోని గంటలను కొట్టరాదు. ఇది కూడా శాస్త్రం ప్రకారం సరైనది కాదు.
గుడికి వెళ్ళినప్పుడు ఈ నియమాలను పాటిస్తే సకల దోషాలు (All bugs) తొలగిపోయి దేవుని అనుగ్రహం మన పైన ఉంటుంది. ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు (Ashtaishwaryas) ప్రాప్తిస్తాయి. భగవంతుని స్మరణ మనకు విజయాలను కలిగిస్తుంది.