Chanakya Niti: పుట్టుకతోనే అమ్మాయిల్లో కామన్ గా ఉండే లక్షణాలు ఇవే..
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చాలా విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా వైవాహిక జీవితం, సమాజం, జీవితం, డబ్బు ఆరోగ్యం గురించి కూడా చెప్పారు.

ఆచార్య చాణక్యుడికి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన మన జీవితానికి అవసరం అయ్యే చాలా రకాల విషయాలను ఎప్పుడో చాణక్య నీతి ద్వారా తెలియజేశారు. ఆయన నియమాలు ఇప్పటి సమాజానికి కూడా పనికొచ్చేలా ఉపయోగకరంగా ఉంటాయి. వైవాహిక జీవితం, జీవితం, డబ్బు గురించి మాత్రమే కాదు.. స్త్రీలకు చిన్నతనం నుంచే కామన్ గా వచ్చే లక్షణాల గురించి కూడా ఆయన తన నీతిలో పేర్కొన్నారు. మరి, అవేంటో చూద్దామా..
అబద్ధాలు చెప్పి పనులు పూర్తి చేసుకోవడం
చాలా మంది అమ్మాయిలు కామన్ గా అబద్దాలు చెబుతూ ఉంటారు. చాలా మందికి నోరు తెరిస్తే అబద్దం చెప్పే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వారికి చిన్నతనం నుంచే ఉంటుంది. అబద్దాలు చెప్పి.. తమ పనులు చేయించుకోవడంలో వీరు ముుందుంటారు. స్త్రీలు అబద్దాలు చెప్పడంలో దిట్ట. ఇలాంటి వాటిలో వారికి ఎలాంటి ట్రైనింగ్ లాంటివి అవసరం లేదు. అది కూడా.. వారు చెప్పింది అబద్దం అనే అనుమానం కూడా రాకుండా చెప్పగలరు.
ఎక్కువ తెలివైన దానిలా ఫీల్ అవ్వడం
భార్యాభర్తలు ఎప్పుడూ తామే ఎక్కువ తెలివైన వాళ్ళమని నిరూపించుకోవాలని చూస్తారు. ఎదుటి వ్యక్తి తమకంటే బలహీనుడని అనుకుంటారు. ఈ అలవాటు వల్ల ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా స్త్రీలు.. ప్రతి విషయంలోనూ తమ భర్త కంటే తామే తెలివైన వారం అని ఫీలౌతూ ఉంటారు. అది నిజం అని నిరూపించడానికి వాదనలకు కూడా దిగుతుంటారు.
డబ్బు పిచ్చి..
అబ్బాయిలకు డబ్బు పిచ్చి ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ, మగవాళ్లకంటే ఆడవాళ్లకే డబ్బు పిచ్చి ఎక్కువ. డబ్బు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తారు. దీనికోసం కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతారు. దీనివల్ల తప్పుదోవ పట్టే ఛాన్స్ ఉంది.
మూర్ఖంగా ప్రవర్తించడం
ఆడవాళ్లు కొన్నిసార్లు అర్థం లేని పనులు చేస్తారు. చాలాసార్లు లాజిక్ లేని పనులు చేస్తారు. వేరేవాళ్ల ప్రభావంతో ఇలా చేసి తర్వాత బాధపడతారు. దీనివల్ల ఎదుటి వ్యక్తికి నష్టం జరుగుతుంది.