చాణక్య నీతి : భార్య గురించి ఎవరితోనూ చెప్పకూడని విషయాలు ఇవే
దాంపత్య జీవితం విజయవంతంగా సాగాలి అంటే… దంపతులు కచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలట. అందులో ముఖ్యంగా.. భార్యకు సంబంధించిన విషయాలను భర్త ఇతరులు ఎవరితోనూ పంచుకోకూడదట.
chanakya woman
ఆచార్య చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను చెప్పారు. జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలో చెప్పడంతో పాటు… భార్యభర్తల మధ్య బంధం సరిగ్గా సాగాలంటే ఏం చేయాలో కూడా ఆయన వివరించారు. మరి, చాణక్య నీతి ప్రకారం భర్త పొరపాటున కూడా భార్య గురించి కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదట. మరి అవేంటో తెలుసుకుందామా..
దాంపత్య జీవితం విజయవంతంగా సాగాలి అంటే… దంపతులు కచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలట. అందులో ముఖ్యంగా.. భార్యకు సంబంధించిన విషయాలను భర్త ఇతరులు ఎవరితోనూ పంచుకోకూడదట.
భార్యభర్తల మధ్య గొడవలు రావడం సహజం. భార్యపై భర్తకు కోపం రావడం కూడా సహజమే. అయితే.. తమ మధ్య గొడవ జరిగిందని.. తనకు భార్య పై కోపం రావడానికి కారణం ఇదే అంటూ భర్త ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకూడదట. కేవలం తన కోపాన్ని భార్యకు మాత్రమే చెప్పాలట. అందరితో చెప్పి.. ఆమెను చులకన చేయకూడదట.
chanakya neeti
ఏ వ్యక్తి అయితే.. తన భార్య గురించి ప్రతి విషయాన్ని ఇతరులకు ఫిర్యాదు చేస్తాడో.. ఆ ఇంట్లో ఎప్పుడూ సమస్యలు వస్తూనే ఉంటాయట. అందుకే.. భార్యతో సమస్య ఉంటే.. ఆమెతోనే మాట్లాడి పరిష్కరించుకోవాలి. కానీ ఇతరులతో చెప్పకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు.
అంతేకాదు.. భార్యభర్తల మధ్య సమస్యలను ఇతరులతో పంచుకోవడం వల్ల..వారి మధ్య ఉన్న వీక్ నెస్ లు అందరికీ తెలిసిపోతాయి. దాని వల్ల వారికి కొత్త సమస్యలు వస్తాయని చాణక్యుడు చెబుతున్నాడు.
అంతేకాదు.. భర్త.. తన భార్యపై కోపాన్ని ఇంట్లో మాత్రమే చూపించాలి. ఇతరుల ముందు చూపించకూడదు. ఆమెను ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడటం, తిట్టడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆమె మర్యాద, గౌరవం తగ్గిపోతాయట.