చాణక్య నీతి: ఇలాంటి అమ్మాయిలతో పెళ్లి నరకమే
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. జీవితాంతం సంతోషంగా ఉండాలంటే... జీవితంలోకి మనం ఎవరిని ఆహ్వానిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. కాగా, చాణక్య నీతి ప్రకారం.. అబ్బాయిలు కొన్ని లక్షణాలు ఉండే అమ్మాయిలను అస్సలు పెళ్లి చేసుకోకూడదట. మరి, ఎలాంటి వారిని చేసుకోకూడదో చూద్దాం...
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. మూడు ముళ్లతో ఈ బంధం ఏర్పడి.. జీవితాంతం కలిసి నడుస్తామని ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటారు. పెళ్లి తర్వాత జీవితాంతం సంతోషంగా ఉండాలని అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా కలలు కంటారు. అయితే... వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే తమ జీవితంలోకి ఆహ్వానించే అమ్మాయిని సరిగా ఎంచుకోవాలని, కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిలను మాత్రం పొరపాటున కూడా పెళ్లి చేసుకోకూడదట. వాళ్లతో జీవితం నరకం లా ఉంటుందట.
సంతోషకరమైన జీవితం
పెళ్లి జీవితం బాగుండాలంటే భార్యకి లోభం ఉండకూడదు. ఉన్న దాంట్లో సంతోషపడే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక భావాలున్న అమ్మాయిలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. డబ్బు పై ఆశ ఎక్కువగా ఉన్నవారిని చేసుకోకూపోవడమే మంచిది.
మంచి భార్య లక్షణాలు
కష్టం విలువ తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది. వారు ఖర్చులు విచ్చలవిడిగా చేయరు. గెలవాలనే పట్టుదల ఉన్న అమ్మాయిలు మంచి భార్యలు అవుతారు. జల్సాలు చేసే లక్షణాలు ఉన్నవారిని ఎంచుకోవాలి.
కుటుంబ సఖ్యత
భార్యకి రెండు కుటుంబాల వారితో సఖ్యంగా ఉండే లక్షణం ఉండాలి. ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకునే భార్య ఉంటే సమస్యలు రావు. కుటుంబంలో గొడవలు సృష్టించే వారికి దూరంగా ఉండాలి.
కోపం ఎక్కువ ఉండకూడదు
చాణక్య నీతి ప్రకారం.. కోపం ఎక్కువగా ఉన్న అమ్మాయిలతో సమస్యలు తప్పవు. ప్రతి విషయానికీ కోపం తెచ్చుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. వీలైనంత వరకు ఓర్పుగా ఉండే అమ్మాయిని ఎంచుకోవాలి.