Chanakya Niti: ఈ అలవాట్లు మానేస్తే....మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు..!
Chanakya Niti: జీవితంలో విజయం సాధించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? ఆ విజయం సాధించాలి అంటే...కొన్ని అలవాట్లను మధ్యలోనే వదిలేయాలి అని చాణక్యుడు చెప్పాడు. అవి వదిలేయకపోతే విజయాన్ని ఎప్పటికీ చేరుకోలేరు.

Chanakya Niti
ఆచార్య చాణక్యుడు అత్యంత తెలివైన పండితుడుగా గుర్తింపు సంపాదించుకున్నారు. మానవాళి సంక్షేమం కోసం ఆచార్య చాణక్య అనేక విషయాలను చెప్పారు. దీనినే మనం చాణక్య నీతి అని పిలుచుకుంటాం. ఆయన చెప్పిన విషయాలను ఫాలో అయితే... జీవితంలో కచ్చితంగా సక్సెస్ అవ్వగలరు. కొన్ని రకాల అలవాట్లు మనల్ని ముందుకు తీసుకు వెళ్లకపోగా... కిందకు పడేస్తాయి. అందుకే, కొన్ని హ్యాబిట్స్ ని వదిలేయాలి. అప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లగలం. విజయం కూడా సాధించగలం. మరి, వేటిని వదిలేయాలో చాణక్యుడు ఏం చెబుతున్నాడో తెలుసుకుందాం....
భయాన్ని వదిలేయాలి..
చాణక్యుడి ప్రకారం, మీరు జీవితంలో విజయం సాధించాలి అనుకుంటే... మీలో ఉన్న అంతర్గత భయాలను అధిగమించడం చాలా ముఖ్యం. భయపడుతూ ఉంటే.. జీవితంలో కనీసం ముందుకు కూడా వెళ్లలేరు. భయాన్ని వదిలి.. ధైర్యం గా ముందుకు వెళితే... కోరుకున్నది దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇతరుల గురించి చింతించే అలవాటు...
చాణక్య నీతి ప్రకారం, మీరు ఏదైనా పని చేస్తే... దాని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని కంగారు పడుతూ ఉంటారు. వాళ్లు ఏమనుకుంటారో, వీళ్లు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చొంటే.. జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. ముందు ఇతరుల గురించి ఆలోచించడం మానేసినప్పుడే... లైఫ్ లో సక్సెస్ అవ్వగలరు అని చాణక్యుడు చెబుతున్నాడు.
సోమరితనాన్ని తరిమికొట్టాలి...
చాణక్యుడి ప్రకారం, సోమరితనం మీ వైఫల్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు సోమరితనాన్ని వదులుకున్నప్పుడు, మీ కోసం అనేక విజయ ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడు జీవితంలో విజయం సాధించకుండా ఎవరూ మిమ్మల్ని ఆపలేరు.
4.అహంకారం...
చాణక్య నీతి ప్రకారం, అహం జీవితంలో మీ విజయానికి ఆటంకం కలిగిస్తుంది. అహం ఉన్న వ్యక్తులు తరచుగా తమ లక్ష్యాలను కోల్పోతారు. జీవితంలో విజయం సాధించడంలో విఫలమవుతారు. అహంకారాన్ని వీడితే..జీవితంలో సక్సెస్ అవుతారు.