Chanakya Niti: ఇలాంటి అమ్మాయిలను పెళ్లాడితే రాత్రికి రాత్రే ధనవంతులౌతారు
ఆచార్య చాణక్యుడి ప్రకారం ఐదు రకాల స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల అదృష్టం లభిస్తుందట. ముఖ్యంగా ధనప్రాప్తి ఎక్కువగా కలుగుతుందట.

ఆచార్య చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను చెప్పారు. జీవితంలో ముందుకు సాగాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాలను కూడా ఆయన తన నీతిలో ప్రస్తావించారు. కాగా.. ఆయన ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని కూడా చెప్పడం విశేషం.స్త్రీ అందాన్ని చూసి ఎప్పుడూ వివాహం చేసుకోకూడదట. స్త్రీ చూడటానికి అందంగా ఉన్నా సద్గుణాలు లేకపోతే కష్టకాలంలో భర్తను వదిలేసి వెళ్లిపోతుందట. కాబట్టి.. సద్గుణాలు ఉన్న అమ్మాయినే వివాహమాడాలి. చాణక్య నీతి ప్రకారం, ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే అదృష్టం తలుపుతడుతుందో తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుని ప్రకారం, ధర్మాన్ని నమ్మే స్త్రీని పురుషుడు వివాహం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న స్త్రీ ధార్మిక ఆచారాలలో నిమగ్నం కాకపోతే, తరువాతి తరం నైతిక విలువల లోపంతో బాధపడుతుంది. ఆమె తన పిల్లలకు మంచి సంస్కారం నేర్పలేదు. కాబట్టి, ఎల్లప్పుడూ ధార్మిక కర్తవ్యాలను నిర్వర్తించే స్త్రీనే వివాహం చేసుకోవాలి.
చాణక్య నీతి ప్రకారం, పురుషుడు తన పరిమితులను పాటించే స్త్రీని వివాహం చేసుకోవాలి. పరిమితుల్లో ఉండే స్త్రీ తన భర్త గౌరవాన్ని కాపాడుతుంది, సమాజంలో అతని కీర్తిని పెంచుతుంది. అలాంటి స్త్రీ తన భర్త తల ఎప్పుడూ అవమానంతో తలవంచుకునేలా చేయదు.
కోపాన్ని అదుపులో ఉంచుకునే స్త్రీ వివాహానికి అనువైనది అని ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో చెప్పాడు. కోపం మనిషికి పెద్ద శత్రువు. కోపానికి గురయ్యే స్త్రీ తన భర్తను, కుటుంబాన్ని సంతోషంగా ఉంచలేదు. అందుకే శాంతంగా ఉండే అమ్మాయిని మాత్రమే పెళ్లాడాలట.
వివాహానికి సిద్ధంగా ఉన్న స్త్రీనే వివాహం చేసుకోవాలని ఆచార్య చాణక్యుడు వివాహానికి సంబంధించిన విషయాల్లో చెప్పాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని స్త్రీని పెళ్లి చేసుకోకండి. స్త్రీ స్వంత ఇష్టంతో వివాహం చేసుకుంటేనే భర్తను సంతోషంగా, గౌరవంగా ఉంచుతుంది. బలవంతంగా పెళ్లి చేసుకున్న స్త్రీ కుటుంబ జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది.