Chanakya Niti: పురుషులు ఈ మూడు విషయాలకు దూరంగా ఉండాలి
జీవితంలో విజయం సాధించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే ఆ విజయం సాధించాలంటే మూడు విషయాలకు పురుషులు దూరంగా ఉండాలి అని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, ఆ మూడు విషయాలేంటో చూద్దామా...

అర్థశాస్త్ర నిపుణుడు, ఆచార్య చాణక్యుడికి పరిచయం అవసరం లేదు. ఆయన కేవలం అర్థశాస్త్ర పాఠాలు మాత్రమే కాదు, జీవిత సత్యాలను కూడా వివరించారు. సమాజంలో మనిషి ఎలా జీవించాలి? ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాలను కూడా చాణక్యుడు వివరించాడు.
చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి ముఖ్యంగా పురుషుడు జీవితంలో విజయం సాధించాలన్నా, జీవితంలో ఏదైనా సాధించాలన్నా.. మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలట. ఆ మూడుు విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఏ రంగంలోనూ విజయం సాధించలేడట. మరి, ఆ మూడు ఏంటో చాణక్యుడు ఏం చెప్పాడో చూద్దాం..
చాణక్య పండితుడు చెప్పినట్లుగా, అగ్ని, ప్రభావవంతమైన వ్యక్తులు, స్త్రీల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ దూరం పాటించడం మంచిది కాదు, అలాగే ఎక్కువ సాన్నిహిత్యం కూడా మంచిది కాదు.
చాణక్య నీతి ప్రకారం, అగ్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్నికి చాలా దగ్గరగా వెళ్లకూడదు, అలాగే అగ్నికి చాలా దూరంగా ఉండకూడదు. అగ్ని నుండి సురక్షితమైన దూరం పాటించాలి.
చాణక్య నీతి ప్రకారం, ప్రభావవంతమైన వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తులతో శత్రుత్వం లేదా స్నేహం, రెండూ మంచివి కావు.
చాణక్య నీతి ప్రకారం, స్త్రీలతో సంబంధాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో ఎక్కువ సమయం గడిపితే ఇబ్బందుల్లో పడవచ్చు. స్త్రీలకు దూరంగా ఉండటం కూడా మంచిది కాదు. వారితో ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండకూడదు. అంటే.. ఆయన ప్రకారం.. స్త్రీలకు పూర్తిగా దూరంగా ఉండకూడదు. అలా అని.. వారి మోజు, మాయలో కూడా పడిపోకూడదు. ఈ రెండూ ప్రమాదమే.