MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఎక్కువ డబ్బు సేవ్ చేయాలంటే.. ఏ రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలో తెలుసా?

ఎక్కువ డబ్బు సేవ్ చేయాలంటే.. ఏ రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు ఓ ప్రత్యేకమైన టైంలో చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. బ్యాంకులో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడానికి మంచి రోజు గురించి పెద్దగా ఆలోచించరు. అయితే వారం, నక్షత్రం కలిసి వచ్చిన రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీ సేవింగ్స్ పెరుగుతాయట. వాటి గురించి మరింత వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Nov 12 2024, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎవరైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు సమయం, కాలం, రోజు, నక్షత్రం, వారం చూసుకుని చేయడం ఆచారం. ఎందుకంటే అప్పుడే అన్నీ మంచిగా జరుగుతాయని నమ్మకం. పెళ్లి, గృహప్రవేశం, నిశ్చితార్థం, అన్నప్రాశన, బారసాల, వ్యాపారం ప్రారంభం, ఉద్యోగంలో చేరిక ఇలాంటి వాటికి మంచి సమయం చూసుకోని పనులు ప్రారంభిస్తారు. 

ఏ చిన్న పని చేయాలన్నాముహూర్తం చూసుకుంటారు. ఎందుకంటే ఆ పని వల్ల డబ్బులు వస్తాయి. అయితే డబ్బుకు అధిపతి అయిన లక్ష్మీదేవి డబ్బు రూపంలో మీ ఇంటికి రావాలన్నా, ఎక్కువ సంపాదన ఇవ్వాలన్నా కూడా మంచి ముహూర్తం చేసుకోవడం ముఖ్యమంటున్నారు జ్యోతిష్య నిపుణులు. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసే రోజు, తిధి కూడా మీ సేవింగ్స్ పై ప్రభావం చూపుతాయని అంటున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

సంపాదించే డబ్బంతా ఎక్కువగా అకౌంట్స్ లోనే దాచుకుంటారు. ఇలా రెట్టింపు ధనం మీరు అకౌంట్ లో సేవ్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ ను మంచి టైమ్, వారం, రోజు, నక్షత్రం కూడా చూసుకోవాలట. ఇలా చేయకపోతే చెడు ఫలితాలు వస్తాయట. అందుకే డబ్బు విషయంలో మంచి, చెడు చూసుకోవడం చాలా ముఖ్యమని పెద్దలు చెబుతారు. ఇప్పటివరకు అలా లేకపోతే ఇక నుండి మంచి సమయం, వారం చూసుకోవాలని జ్యోతిషులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంక్ లో కొత్త ఖాతా తెరవాలనుకునేవారు సరైన సమయం, కాలం, వారం చూసుకుని తెరిస్తే పొదుపు రూ.కోట్లకు పెరుగుతుంది.

35

కొత్త అకౌంట్ తెరవాలంటే ఏ రోజు పడితే ఆ రోజు మంచిది కాదు. గురువుకి ప్రతీకమైన గురువారం రోజు అకౌంట్ ఓపెన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయట. వారంతో పాటు నక్షత్రం కూడా కలిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంటే గురువారంతో పాటు పూర్వాభాద్ర నక్షత్రం కూడా కలిసి వచ్చిన రోజు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయంట. 

45

ఈ రెండూ కలిసి వచ్చే రోజున బ్యాంక్ అకౌంట్ తెరిస్తే డబ్బు ఎక్కువగా దాచుకోవడానికి ఛాన్స్ ఉంటుందని జ్యోతిష్య రహస్యం. బ్యాంక్ అకౌంట్ మాత్రమే కాదు.. డబ్బు దాచుకోవాలనుకుంటే ఇంట్లో కొత్త మట్టి డిబ్బీని కూడా గురువారం, పూర్వాభాద్ర నక్షత్రం కలిసి వచ్చే రోజున ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ప్రతి గురువారం డిబ్బీలో లేదా బ్యాంక్ ఖాతాలో డబ్బు దాచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు కాదనకున్నా ప్రతి పనిలో విజయం సాధిస్తారు. చాలా సులభంగా డబ్బు ఖర్చు చేయొచ్చు. కానీ దాచుకోవడమే కష్టం. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు ఆదా చేసే విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఎప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

55

ఉరకల పరుగుల ఈ జీవితంలో రోజు వారీ ఖర్చులకే డబ్బుల సరిపోవడం లేదు. ఇక సేవింగ్స్ చేయడం గురించి కలలో కూడా ఊహించలేం. అందుకే సేవింగ్స్ చేసేటప్పుడు కూడా గురువారం, పూర్వాభాద్ర నక్షత్రం ఎంచుకుని ఆ రోజున బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బు మిమ్మల్ని ఎప్పటికీ విడిచి వెళ్లదు. అంతకంతకు పెరుగుతూనే ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Recommended image2
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Recommended image3
Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved