MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • బంగారం ధరించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి...!

బంగారం ధరించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి...!

బంగారం  ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలియజేయడానికి, మహిళలు తమ ఎడమ చేతికి బంగారు ఉంగరాన్ని ధరించాలి. పురుషులు వారి కుడి చేతికి ధరించాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 05 2023, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బంగారం ఎల్లప్పుడూ మనుషులను ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్కరూ బంగారం కొనుుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. బంగారం కలిగి ఉండటం అనేది ఒకరి సంపదకు చిహ్నంగా గుర్తిస్తారు. బంగారం పెట్టుబడిగా తన స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఆభరణంగా అందంగా పెరిగి.. కష్టకాలంలో కచ్చితంగా సాయం చేసింది. ఇవన్నీ ఎలా ఉన్నా జ్యోతిష్యంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అనేక సంస్కృతులలో బంగారం ధరించిన వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఎవరికైనా సంతోషాన్ని, శాంతిని, స్థిరత్వాన్ని కలిగిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బంగారాన్ని ధరించడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు..
 వివిధ కులాలు, సంస్కృతులకు చెందిన చాలా మంది ప్రజలు ఆనందం, అదృష్టం, ప్రేమ, ఆధ్యాత్మిక శాంతి కోసం ప్రతిరోజూ బంగారం, ఇతర రత్నాలను ధరిస్తారు. ఉత్తమ ప్రభావం కోసం బంగారాన్ని అనేక రత్నాలతో కలిపి ఉపయోగిస్తారు.

37

మీ ఉంగరపు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం ద్వారా, మీరు దైవిక చైతన్యాన్ని ఆకర్షించగలరని నమ్ముతారు. జీవితంలో అడ్డంకులు తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. బంగారం  ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలియజేయడానికి, మహిళలు తమ ఎడమ చేతికి బంగారు ఉంగరాన్ని ధరించాలి. పురుషులు వారి కుడి చేతికి ధరించాలి.
భూమిపై లభించే అత్యంత ముఖ్యమైన లోహం బంగారం. ఇది శ్రేయస్సు మరియు రాయల్టీని సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో బంగారం ప్రతి గ్రహంతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, ఇది ప్రధానంగా బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. బంగారం, సరిగ్గా ధరిస్తే, అదృష్టం, శ్రేయస్సును ఆకర్షించవచ్చు.
 

47

బంగారం ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు....
బంగారం బలం , వేడిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే బంగారాన్ని ధరించడానికి చాలామంది సూచించే వివిధ నియమాలను ఒకసారి చూద్దాం.
జలుబు, దగ్గు సమస్య ఉంటే చిటికెన వేలుకు బంగారాన్ని ధరించాలి.
మీరు పేరు, కీర్తి లేదా హోదాకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు మీ మధ్య వేలికి బంగారాన్ని ధరించాలి.
మీకు ఏకాగ్రత లోపిస్తే, మీరు మీ చూపుడు వేలుకు బంగారాన్ని ధరించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
వివాహంలో సమస్యలను ఎదుర్కొంటున్నారా? మీకు, మీ భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం లోపించిందా? అవును అయితే, బంగారు గొలుసు లేదా లాకెట్టు ధరించండి. ఇది మీ కోసం అద్భుతాలు చేస్తుంది.
గర్భం దాల్చడంలో సమస్యలు ఉన్నవారు ఉంగరపు వేలికి బంగారాన్ని ధరించాలి.
కడుపు సమస్యలు లేదా ఊబకాయం ఉన్నవారు... కోపం సమస్యలు ఉన్నవారు బంగారం ధరించడం మానుకోవాలి. మీ జాతకంలో బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉంటే బంగారం ధరించవద్దు.

57

ఇనుము, బొగ్గు వ్యాపారులు బంగారానికి దూరంగా ఉండాలి. గర్భిణులు, వృద్ధులు బంగారం ధరించడం మానుకోవాలి.
నడుము కింది భాగంలో బంగారాన్ని ధరించకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది దురదృష్టాన్ని ఆకర్షిస్తుంది. బంగారాన్ని లక్ష్మీ దేవి  చిహ్నంగా భావిస్తారు, కాబట్టి దానిని నడుము క్రింద ధరించడం ఆమెను అగౌరవపరుస్తుంది అని నమ్ముతారు.
బంగారు పాదరక్షలు ధరించడం మానుకోండి.
బంగారాన్ని ధరించి మాంసాహారం, మద్యం సేవించడం దురదృష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.

67

తూర్పు లేదా నైరుతి వైపు లాకర్‌లో ఎరుపు రంగు కాగితం లేదా గుడ్డపై బంగారాన్ని ఉంచాలి.
ఇనుమును బంగారంతో కలపవద్దు.
బంగారాన్ని తల దగ్గర పెట్టుకోవద్దు. మీరు నిద్రలేమిని ఎదుర్కోవచ్చు.

77

మేష, కర్కాటక, సింహ, ధనుస్సు రాశుల వారికి బంగారం చాలా శుభప్రదం. ఇది వృశ్చికం, మీన రాశులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృషభం, మిథునం, కన్యారాశి, కుంభ రాశుల వారికి సమస్యలు రావచ్చు. తులారాశి, మకరరాశి వారు బంగారం ధరించడం మానుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved