Sperm Count: పాము ఆకారంలో పురుషుని వీర్యం...దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణం ఇదే
పాముని సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. అంతేకాదు.. ఆయనే ఆదిశేష, అనంత వీర్య అని కూడా పిలుస్తారు. దీని అర్థం అపరిమిత శక్తి.

మనుషులకు, పాములకు ఉన్న సంబంధం..
పాముల ప్రపంచానికీ, మానవులు ప్రపంచానికీ మధ్య సంబంధం ఉంది. పురుషుడి శుక్ర కణం బలం, శుక్రకణాల పరిమాణం, పాముల పరిమాణానికి మధ్య సంబంధం ఉందని చెబితే మీరు నమ్ముతారా? ఈ విషయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వినయ్ గురూజీ తెలియజేశారు. మరి, ఆయన ప్రకారం.. మనుషులకు, పాములకు ఉన్న సంబంధం ఏంటి? ఆధ్యాత్మిక కారణాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
పాము, మానవ వీర్యానికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి..?
పాముని సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. అంతేకాదు.. ఆయనే ఆదిశేష, అనంత వీర్య అని కూడా పిలుస్తారు. దీని అర్థం అపరిమిత శక్తి. ఇక.. మానవ శరీరంలోని శుక్ర కణాల రూపం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఈటె రూపంలో ఉంటుంది. ఇక.. పురుషుడు స్త్రీ గర్భంలోకి పంపించే వీర్య కణాలు కూడా పాము రూపంలోనే ఉంటాయి. వాటి రూపం మాత్రమే కాదు.. వాటి కదిలికను పరిశీలించినా కూడా.. మనకు పాము రూపమే గుర్తుకు వస్తుంది. అందుకే, మానవ జాతికి, సర్పానికి దగ్గరి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ వీర్య కణం స్త్రీలోని అండంతో కలిసి పిండంగా మారుతుంది. ఆ పిండం నుంచే పది అవతారాలు కనిపిస్తాయి. మత్స్య,కూర్మ, వరాహ, నరసింహ, ఆ పై చిన్న శిశువు వామనుడు బయటకు వస్తాడు. ఆ వామనుడు జ్ఞానం పొందినప్పుడు అతను రాముడు అవుతాడు. కర్మతో సంతృప్తి చెందినప్పుడు.. అతను కృష్ణుడు అవుతాడు. మొత్త తెలుసుకున్నవాడు బుద్ధుడు అవుతాడు. ఆపై సమాజం పునరుత్థానం కోసం కల్కి అవుతాడు.
కశ్యప ముని పిల్లలు:
నాగులు కశ్యప ముని కుమారులు. ఎనిమిది నాగులు అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్రుడు, తక్షకుడు. నాగుడికి ఐదు తలలు ఉన్నాయి. శేషుడికి ఏడు , వాసుకికి ఐదు. వాసుకి అంటే మన ప్రపంచం. అతను మనలను రక్షిస్తాడు. మన శరీరంలో ఐదు ప్రాణాలు, ఐదు అంశాలు ఉన్నాయి. దీనికి చిహ్నం ఐదు తలలు. శేషుడికి ఏడు తలలు ఉన్నాయి, అంటే తిరుమలలో ఏడు ద్వారాలు ఉన్నాయి, అతనికి ఏడు తలలు ఉన్నాయి ఎందుకంటే అతను తన తలపై ఏడు లోకాలను మోస్తున్నాడు. నారాయణుడు అనంత పద్మనాభుడిపై నిద్రించేవాడు. ఆయన అన్ని సర్పాలు , నాగాలకు ప్రభువు.
సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే సంతానం...
వంధ్యత్వంతో బాధపడుతున్న వ్యక్తులు పాము రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మీరు చూసే ఉంటారు.నిజంగానే.. ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే.. సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని వినయ్ గురూజీ చెప్పారు. జ్యోతిష్కుల ప్రకారం, సర్పసంస్కారం చేయడం వల్ల కుటుంబంలోని అన్ని లోపాలు తొలగిపోతాయి. ఈ ఆచారం ముఖ్యంగా సంతానం పొందడానికి, దోష నివారణకు, కుటుంబంలో వైవాహిక సామరస్యం, ఆనందం , శాంతికి, వృత్తి , వ్యాపార అభివృద్ధికి, ఆర్థిక ఇబ్బందుల పరిష్కారం కోసం, కోర్టు కార్యాలయాలలో సజావుగా సాగడానికి, మంచి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.