MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ద్వారాలకంటూ ఒక ప్రత్యేక స్థానం (Special position) ఉంది. ఇంటి ద్వారాల సంఖ్య ప్రకారం ఇంటిలో నివసించే కుటుంబ సభ్యుల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పవచ్చు. అద్దె ఇల్లయినా, సొంత ఇల్లయినా శుభ సంఖ్యలో ద్వారాలు ఉండాలని శాస్త్రీయ పరంగా ద్వారాలకు ఒక విశిష్ట స్థానం ఉందని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది. శుభ సంఖ్యలో ద్వారాలు (Gates) ఉంటే ఇంట్లో నివసించే వారికి మంచి ఫలితాలను ఇస్తాయి. అదే శాస్త్రానికి విరుద్ధంగా ద్వారాలు ఉంటే అశాంతి కలిగించే ఫలితాలు ఇస్తాయి. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా గృహంలో ఉండే ద్వారాల సంఖ్యను బట్టి ఇంటిలో నివసించే వారికి కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం..  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 04 2021, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

శుభాన్ని కలిగించే ద్వారాల సంఖ్య వాటి ఫలితాలు: నివసించే ఇంటిలో రెండు ద్వారాలు ఉంటే చాలా శ్రేష్టము. రెండు ద్వారాలు గల ఇంటిలో నివసించే వ్యక్తులు శ్రేష్టమైన జీవన అభివృద్ధి కలుగుతుంది. అదే నాలుగు ద్వారాలు ఉన్న గృహంలో నివసించే వ్యక్తులకు ఆయువు, ఆరోగ్యాలను (Health) కలిగి వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. వీరికంటూ సమాజంలో ప్రత్యేక గౌరవం ఏర్పడి మంచి గుర్తింపు కలుగుతుంది. ఆరు ద్వారాలున్న ఇల్లు పుత్ర వృద్ధి, శ్రేయస్సు, ఐశ్వర్యము (Wealth) కలుగుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అదే ఎనిమిది వారాలు ఉన్న గృహంలో నివసించే వ్యక్తులకు సకల భోగభాగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలతో (Ashtaishwaryas) తులతూగుతారు. పన్నెండు ద్వారాలు గల ఇల్లు ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని (Development) కలిగించి మంచి కీర్తి ప్రాప్తిస్తుంది. పద్నాలుగు ద్వారలు ఉన్న ఇల్లు కుటుంబ వృద్ధి, ధన సంపదని కలిగిస్తుంది. పదహారు ద్వారములు గల ఇల్లు అన్నింటిలో విజయం లభించింది లాభములను చేకూరుస్తుంది. 
 

35

కీడును కలిగించే ద్వారాల సంఖ్య వాటి దుష్ఫలితాలు: మూడు ద్వారములు గల ఇల్లు  శత్రువులను పెంచి అపనిందల పాలుచేస్తుంది. అధిక ఖర్చులను పెంచి ఆర్థిక నష్టాన్ని (Financial loss) కలుగజేస్తుంది. ఐదు ద్వారాలు గల ఇల్లు అనారోగ్య సమస్యలను, సంతానానికి కీడును, శత్రువుల నుండి ఇబ్బందులను కలిగిస్తుంది. ఏడు ద్వారములు ఉన్న ఇల్లు మరణాలకు (Deaths) దారితీస్తుంది. అధిక కష్టాలను కలిగించి ఇబ్బందులకు గురిచేస్తుంది.
 

45

తోమ్మిది ద్వారములు ఉన్న ఇల్లు అశాంతిని కలిగించి ఇంటి యజమానికి తీరని నష్టాన్ని కలగజేస్తుంది. పది ద్వారాలు ఉన్న ఇల్లు దొంగల భయం (Fear of thieves) ఉంటుంది. పదకోండు ద్వారాలు ఉన్న ఇల్లు భార్య వ్యభిచారం చేసేలా చేస్తుంది. పదమూడు ద్వారాలు ఉన్న ఇల్లు మరణానికి (Deaths) దారి తీస్తుంది. అనేక కష్టనష్టాలను కలిగించి ఇబ్బందులకు గురి చేస్తుంది. పదిహేను ద్వారములు ఉన్న ఇల్లు అశాంతికి, అధిక ఖర్చులకు దారితీస్తుంది.
 

55

వాస్తు రీత్యా (Architecturally) ద్వారాలు ఉంటే ఆ ఇంటిలో నివసించే వారు ఆరోగ్యంగా, అన్యోన్యంగా (Reciprocally) ఉంటూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తారు. అదే వాస్తురీత్యా భిన్నంగా ఉంటే ఆ ఇంటిలో నివసించేవారు కలహాలతో, చింతలతో, అనారోగ్యంతో, కష్టనష్టాలతో ఇబ్బంది పడతారు. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణంలో ద్వారాలు సరైన సంఖ్యలో ఉండాలి.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved