కర్ణాటకలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
ఆది శంకరాచార్యుల (Adi Shankaracharyulu) వారు కేరళ రాష్ట్రంలోని కాలడి ప్రాంతంలో జన్మించారు. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడుగా ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు. ఈయన గురువు సిద్ధాంతవేత్త, మహాకవి. శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైతం. ఈయన అనేక దేవాలయాలను ప్రతిష్టించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఆలయంగా శ్రీ ఆంజనేయస్వామి ఆలయం (Anjaneyaswamy Temple) ఉంది. ఈ ఆలయం విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శంకరాచార్యులవారు హిందూ మతాన్ని దక్షిణాన ఉన్న కన్యాకుమారి (Kanyakumari) నుండి మొదలు ఉత్తరాన ఉన్న జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir) వరకు వ్యాప్తి చేయడంలో కృషి చేశారు. ఈయన క్రీస్తు పూర్వం 7-8 వ శతాబ్దం జన్మించి ఉంటారని ప్రజల విశ్వాసం. శంకరాచార్యుల వారిని సాక్షాత్తు శివుని అవతార స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఈయన తన శిష్యులతో కలసి కాలినడకన భారతదేశంలోని అనేక దేవాలయాలను సందర్శించారు.
హిందూ మతానికి నాలుగు దీపస్తంభాలుగా శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం మఠాలను స్థాపించారు. ఈయన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దక్షిణ భారత దేశంలోని పడమటి కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో పడమటి కనుమల్లో మల్నాడు ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, లోయలు, అరణ్యాలతో ఆకర్షించే పవిత్ర శృంగేరిలో (Srungeri) ప్రతిష్టించారు.
ఈ ఆలయాన్ని కేరే ఆంజనేయ దేవాలయం (kere Anjaneya Temple) అని కూడా పిలుస్తారు. కేరే అనే పదాన్ని కన్నడ భాష నుంచి తీసుకోబడింది. కేరే అంటే సరస్సు (Lake) అని అర్థం. శంకరాచార్యుల వారు స్థాపించిన ఏకైక ఆంజనేయస్వామి దేవాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి. ఈ దేవాలయం సరస్సు ఒడ్డున ఉంది. శృంగేరిలో ప్రసిద్ధి చెందిన ఈ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించడానికి పర్యాటకులు వేల సంఖ్యలో వస్తుంటారు.
ఈ దేవాలయం చూడడానికి చిన్నదైనా చాలా అందంగా ఉంటుంది. ఈ దేవాలయం చుట్టుపక్కల వాతావరణం (Weather), ప్రకృతి దృశ్యాలు (Landscapes) పర్యాటకుల మనసుకు హాయిని కలిగిస్తాయి. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి 27 మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. శృంగేరి సందర్శనానికి వచ్చిన భక్తులు మొదట ఈ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించిన తర్వాత మిగతా దేవాలయాలు సందర్శిస్తారు.
ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి దక్షిణ దిశగా దర్శనమిస్తూ కుడి చేతితో భక్తులను దీవిస్తూ, ఎడమ చేతిలో తామర (Lotus) పుష్పాన్ని ధరించి ఉండడం విశేషం. ఈయన అద్భుతమైన (Excellent) ముఖతేజస్సుతో భక్తజనులకు దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించిన భక్తజనులకు బలం, ధైర్యం, ధ్యానం చేకూరుతుంది. ఈ దేవాలయంలో శనివారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శృంగేరిలో సందర్శనీయ ప్రదేశాలుగా ఆదిశంకర దేవాలయం, సిరిమనే జలపాతాలు, మల్లికార్జున దేవాలయం, శారదాదేవి ఆలయం (Shardadevi Temple), శృంగేరి మఠం, శ్రీ విద్యాశంకర దేవాలయం (Sri Vidyashankara Temple), గణపతి దేవాలయం ఇలా మొదలగునవి ఉన్నాయి. ఈ ప్రదేశాల సందర్శన పర్యాటకుల మనస్సుకు ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది.