MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • వాస్తు చిట్కాలు: ఇంట్లో చీపురును ఏ దిక్కున పెట్టాలి? చీపురును ఎలా ఉంచితే మంచిదంటే?

వాస్తు చిట్కాలు: ఇంట్లో చీపురును ఏ దిక్కున పెట్టాలి? చీపురును ఎలా ఉంచితే మంచిదంటే?

హిందూమతంలో చీపురును కేవలం క్లీన్ చేసే వస్తువుగా మాత్రమే చూడరు. జ్యోతిష్యుల ప్రకారం.. చీపురు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది. వాస్తు శాస్త్రంలో చీపురుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చీపురును ఎలా పడితే అలా పెడితే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

Mahesh Rajamoni | Published : Sep 19 2023, 09:37 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

వాస్తు శాస్త్రంలో దిశలు చాలా ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఒక నిర్దిష్ట ప్రదేశంలోనే ఉంచాలి. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ఎలాంటి సమస్యలు రావు. వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును ఎక్కడ పెట్టాలి? దీన్ని ఏ సమయంలో కొనాలి? వంటి చీపుర్లకు సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

24
Asianet Image

చీపురును ఎప్పుడూ కూడా దక్షిణ, పడమర దిశల మధ్య స్థలంలోనే ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా చీపురును ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు. చీపురును ఎప్పుడూ కూడా కింద పడుకోబెట్టాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును వంటగదిలో అసలే ఉంచకూడదు. ఈ నియమాలను పాటిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. 

34
Asianet Image

వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురు పాదాలను అసలే తాకకూడదు. అలాగే చీపురును మురికిగా ఉంచకూడదు. అలాగే సాయంత్రం తర్వాత ఇంట్లో చీపురును పెట్టడం మంచిది కాదు. జ్యోతిష్యుల ప్రకారం.. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముందు వరకు చీపురును ఉపయోగించొచ్చు. 

44
Vastu tips of broom

Vastu tips of broom

చీపురు ఎప్పుడు కొనాలి? 

చీపును కొన్ని సమయాల్లో కొనడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. చీపురును కొనడానికి ఉత్తమ సమయం అమావాస్య, మంగళవారం, శనివారం, ఆదివారం. అలాగే సోమవారం, శుక్లపక్షంలో చీపురు కొనకూడదని వాస్తుశాస్త్రం కొనడం మంచిది కాదు. దీన్ని అశుభంగా భావిస్తారు. ఒక వేళ ఈ రోజు చీపురును కొంటే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories