Chanakya Niti: ఈ ముగ్గురికి మాత్రమే భూమి కూడా స్వర్గం లా మారుతుంది..!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో...మానవ సంబంధాల గురించి చాలా గొప్పగా వివరించారు. మనిషి జీవితంలో ఎలాంటి నియమాలు ఫాలో అయితే, లైఫ్ లో సక్సెస్ అవుతారో, సంతోషంగా ఉంటారో కూడా ఆయన తన నీతిలో పేర్కొన్నారు.

Chanakya Niti
భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా సాగాలనే అనుకుంటారు. ఆ సంతోషం కేవలం డబ్బు ద్వారానే వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఆ డబ్బు వెనక పరుగులు తీస్తూ ఉంటారు. అయితే... కొందరు మాత్రం వారి వ్యక్తిత్వం కారణంగానే జీవితంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. ఈ విషయాన్ని చాణక్యుడు స్వయంగా వెల్లడించారు. ఆయన ప్రకారం, ముగ్గురు మాత్రమే.. ఈ భూ ప్రపంచాన్ని కూడా స్వర్గంలా మార్చుకోగలరు. మరి, ఆ ముగ్గురు ఎవరు..? వారి జీవితం ఎప్పుడూ హ్యాపీగా ఎందుకు ఉంటుంది? వీరి గురించి చాణక్యుడు ఏం చెప్పాడు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
చాణక్యుడు చెప్పిన శ్లోకం...
‘‘యస్య పుత్రో వశీభూతో భార్యా చందునగామిని
విభవే యశ్చ సంతుష్టస్తస్య స్వర్గ ఇహైవ హి’’
దీని అర్థం ఏంటి అంటే.... ‘ విధేయుడైన కుమారుడు, గౌరవంగా ఉండే భార్య, సంతృప్తికి తగినంత సందప ఉన్నవాడికి భూమిపైనే స్వర్గం లా ఉంటుంది’ అని చాణక్యుడు చెప్పారు.
1.విధేయత కలిగిన కుమారుడు..
చాణక్యుడి ప్రకారం, తల్లిదండ్రుల మాట వినే, వారి సుఖ దు:ఖాలను పంచుకునే కుమారుడు ఉన్న తల్లిదండ్రులకు ఈ భూమి స్వర్గమే. వారిని గౌరవించే పిల్లలు కేవలం కుటుంబానికి మాత్రమే కాకుండా, సమాజానికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. ఇలాంటి పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రలకు ఆర్థికంగా, భావోద్వేగంగా తోడుగా ఉంటారు.
2.భార్యభర్తల మధ్య గౌరవం...
చాణక్యుడి ప్రకారం, ‘ భార్యా చందనుగామిని’ అంటే.. భర్తకు తోడుగా ఉండే, గౌరవం చూపించే భార్య. నేటికాలంలో ఇది ఇరువురికీ వర్తిస్తుంది. భర్తకు భార్య తోడుగా ఉండాలి.. అదేవిధంగా భార్యకు భర్త కూడా తోడుగా ఉండాలి. గౌరవం చూపించాలి. ఇలా భార్యభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటే, ఆ ఇంట్లో శాంతి ఉంటుంది. ఆ ఇల్లు స్వర్గంతో సమానం. కుటుంబంలో ప్రేమ, పరస్పర గౌరవం ఉంటే.. డబ్బు కన్నా విలువైన సంతోషం లభిస్తుంది.
3.సంతృప్తికి తగిన సంపద....
చాణక్యుడి ప్రకారం “విభవే యశ్చ సంతుష్టః” — అంటే సంపదలో సంతృప్తి. ఎక్కువ సంపద ఉన్నవాడు కాదు.... ఉన్న దాంట్లో తృప్తి పడేవారు ఎక్కువ సంతోషంగా ఉంటారు. ఉన్నదాంట్లో సంతోషంగా గడపడం అలవాటు చేసుకున్నవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అదే నిజమైన ధనం. అలాంటివారికి కూడా భూమి కూడా స్వర్గమయం అవుతుంది.
చాణక్య నీతి....
ఈ మూడు విషయాలను కలిగిన వ్యక్తులు భూమి పై స్వర్గ ఆనందాన్ని పొందుతారు అని చాణక్యుడు చెబుతున్నాడు. సంతోషం అనేది బయట కాదు, మన విలువల్లో, మన ఆలోచనల్లో, మన సంబంధాల్లో దాగి ఉంటుంది. భూమిపైనే స్వర్గాన్ని అనుభవించాలంటే, ఈ మూడు విలువలను జీవితంలో ఫాలో అయితే సరిపోతుంది.