MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Spiritual
  • ఈ 7 పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు

ఈ 7 పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు

మీరు కొత్త ఇంటికి వెళ్తుంటే వాస్తులోని కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. దీని వల్ల ఇంట్లో సుఖం, శాంతి నెలకొంటాయి. ఇంట్లో అందాన్ని పెంచడానికి మీరు చాలా రకాల పెయింటింగ్స్, ఫొటోలు అలంకరిస్తారు. అలాంటి వాటిలో ఈ 7 రకాలు మీ ఇంటి అందాన్ని పెంచడంతో పాటు వాస్తు ప్రకారం ఆరోగ్యం, డబ్బు, చదువును ప్రసాదిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Sep 19 2024, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సాధారణంగా అందరూ కోరుకొనేది ఆరోగ్యం, చదువు, డబ్బు కదా.. ఈ మూడింటిని ఇచ్చే వారు దేవతలైన కనకదుర్గ, సరస్వతి, లక్ష్మీదేవి అని చాలా మంది నమ్ముతారు. ఆ దేవతా మూర్తుల లక్షణాలను ఎల్లప్పుడూ మనకు గుర్తుచేసే పెయింటింగ్స్ ను మీ ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఏడు గుర్రాలు

ఏడు గుర్రాల పెయింటింగ్ జ్ఞానానికి ప్రతీక. ఒకే దిశలో పరుగెడుతున్న ఏడు తెల్ల గుర్రాల పెయింటింగ్‌ను ఇంట్లో పెట్టుకోండి. దీని వల్ల మీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు. ఇంట్లోకి డబ్బు చేరుతుంది. సంపదను ఆకర్షించడానికి ఈ పెయింటింగ్‌ను ఇంట్లో పెట్టుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సూర్య భగవానుడు ఈ 7 గుర్రాలను అదుపులో పెట్టుకొని ఈ విశ్వానికి దిశ, నిర్దేశం చేస్తున్నాడని ఋగ్వేదంలో ఉంది.

38

ఉదయిస్తున్న సూర్యుడు

వాస్తు ప్రకారం సూర్యోదయం పెయింటింగ్ ఇంట్లో ఉంటే మీరు కొత్త అవకాశాలు పొందతారు. ఈ చిత్రం పురోగతికి చిహ్నం. దీన్ని తూర్పు దిశలో ఉంచడం శుభప్రదం. ఉదయిస్తున్న సూర్యుని పెయింటింగ్ ఇంట్లో సానుకూల శక్తిని ప్రసారం చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. 

48

అందమైన నెమలి 

నెమలి అందం, వైభవానికి చిహ్నం. దీన్ని నెమలి బొమ్మలు, చిత్రపటాలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆస్తి, సంపదలు పెరుగుతాయట. నెమలి ఈక ఆకారం శ్రీకృష్ణుడిని సూచిస్తుంది. నెమలి పక్షి శివుని కుమారుడైన కుమారస్వామి వాహనం. అందువల్ల నెమలి పెయింటింగ్ ఇంట్లో ఉండటం వల్ల అందంతో పాటు ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. 

58

గజేంద్ర మోక్షం

గజేంద్ర మోక్షం ఫొటో ఇంట్లో ఉంటే అన్ని కోరికలు తీరతాయి. ఎందుకంటే ఇందులో ఏనుగు అదృష్టాన్ని సూచిస్తుంది. మొసలి పట్టుదలకు చిహ్నం. ఫైనల్ గా శ్రీ మహా విష్ణువు మోక్షాన్ని ప్రసాదించే పరమాత్ముడు. ఇంత గొప్ప చిత్రం ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. దీన్ని మీ ఇంట్లో ఉత్తర దిశలో పెట్టుకోవడం వల్ల డబ్బు, ఆరోగ్యం లభించడంతో పాటు కోరికలన్నీ నెరవేరతాయట. 

68

జలపాతం

జలపాతం పెయింటింగ్ పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లో డబ్బు కొరత ఉండదు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. ఇది మనస్సులో ప్రశాంతతను కలిగిస్తుంది. పారుతున్న నీరు కష్టాలు తొలగిస్తుంది. జాలువారుతున్న జలపాతం ఇంట్లో శాంతిని కలిగిస్తుంది. 

 

78

ప్రవహించే నీరు

ప్రవహించే నీరు సంపద, డబ్బు ప్రవాహానికి చిహ్నం. ఇలాంటి చిత్రం లేదా పెయింటింగ్ ఇంట్లో ఉండటం వల్ల కష్టాలు కూడా అదే విధంగా వెళ్లిపోతాయట. ఈ పెయింటింగ్ ను ఉత్తర దిశలో ఉంచడం వల్ల డబ్బు కొరత ఉండదు.

88

వినాయకుడి పెయింటింగ్

గణేషుడిని కష్టాలు రాకుండా అడ్డుకొనే దేవుడిగా కొలుస్తారు. ఏ పని చేయాలన్నా ముందుగా వినాయకుడికి పూజ చేయడం లేదా ప్రార్థించడం చేయాలని పెద్దలు చెబుతారు. విఘ్నేశ్వరుడి ఫొటోను ఇంటి మెయిన్ హాలులో ఉంచాలి. దీని వల్ల సమస్యలు తొలగి ఆర్థికంగా కష్టాలు తొలగిపోతాయి. 

 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved