MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • Valmiki Jayanti: ఇందుకే రామాయ‌ణం క‌చ్చితంగా చ‌ద‌వాలి.. ఈ 5 అంశాలు జీవితాన్నే మార్చేస్తాయి.

Valmiki Jayanti: ఇందుకే రామాయ‌ణం క‌చ్చితంగా చ‌ద‌వాలి.. ఈ 5 అంశాలు జీవితాన్నే మార్చేస్తాయి.

Valmiki Jayanti: ఒక బోయ‌వాడు అయిన వాల్మీకి మ‌హాన్న‌త వ్య‌క్తిగా మారిన రామాయ‌ణం అనే మ‌హా కావ్యాన్ని ర‌చించాడు. నేడు వాల్మీకి జ‌యంతి వేళ అస‌లు రామాయ‌ణం నుంచి మ‌నిషి నేర్చుకోవాల్సిన 5 ముఖ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 07 2025, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వాల్మీకి జయంతి – రామాయణం గొప్పతనానికి నిదర్శనం
Image Credit : our own

వాల్మీకి జయంతి – రామాయణం గొప్పతనానికి నిదర్శనం

ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా, మనకు జీవిత పాఠాలను నేర్పిన రామాయణాన్ని గుర్తు చేసుకోవాలి. వాల్మీకి రచించిన రామాయణం, మంచి మీద చెడు విజయం సాధిస్తుందన్న సందేశాన్నిఅందిస్తుంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ధర్మం, నీతి, స్నేహం, కుటుంబ విలువలను మనకు నేర్పే ఒక అద్భుత పాఠంలా ఉప‌యోగ‌ప‌డుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐక్యత, సంబంధాల విలువ‌ను నేర్పుతుంది
Image Credit : Asianet News

ఐక్యత, సంబంధాల విలువ‌ను నేర్పుతుంది

రాముడికి అన్ని సంబంధాలు ముఖ్యమైనవి. అయోధ్య‌ను వ‌దిలి వెళ్ల‌మ‌ని చెప్పినా తండ్రి మాట కోసం 14 సంవ‌త్స‌రాలు వ‌న‌వాసం చేశాడు. అత‌నికి అవ‌స‌రం లేక‌పోయినా త‌న అన్న‌కు ద‌క్క‌ని రాజ్యం త‌న‌కు అవ‌సరం లేద‌ని లక్ష్మణుడు కూడా అడవి బాట ప‌ట్టాడు. భ‌ర‌తుడికి రాజ్యం ద‌క్కినా బాధ్య‌త‌ను స్వీక‌రించ‌లేదు క‌దా.. సింహాసంపై రాముడి పాదుక‌లు ఉంచి పాలించాడు. రాజసింహాసనాన్ని స్వీకరించకుండా రాముడు తిరిగొచ్చే వ‌ర‌కు సింహాస‌నాన్ని అధిష్టంచ‌లేదు.

పాఠం: కుటుంబం, స్నేహం, ప్రేమను ప్రాధాన్యం ఇవ్వండి. ఐక్యతలోని శక్తి, జీవనంలో ఏమైనా సమస్యలు ఎదురైనప్పటికీ, మనకు ముందడుగు వేయడానికి సహాయం చేస్తుంది.

36
అంద‌రినీ స‌మానంగా చూడాలి
Image Credit : Asianet News

అంద‌రినీ స‌మానంగా చూడాలి

రాముడు అందరితో సమానంగా ప్రవర్తించారు. శ‌బరి అనే పేద మహిళ ఎంగిలి చేసి ఇచ్చిన ఫలాలను సంతోషంగా తిన్నారు. వాన‌రుల‌తో జ‌త క‌ట్టాడు, వారి క‌ష్టాల‌ను తీర్చాడు.

పాఠం: ప్రతి వ్యక్తిని ప్రేమించండి, గౌరవించండి. కులం, మతం, వర్ణం, స్థానం ఆధారంగా ఎవరినీ వేరు చేయ‌వ‌ద్దు.

46
చెడు వ్య‌క్తుల‌కు దూరంగా ఉండండి
Image Credit : our own

చెడు వ్య‌క్తుల‌కు దూరంగా ఉండండి

కైకేయి.. మొద‌ట్ల రాముడి ప‌ట్ల ప్రేమ‌గా ఉండేది. కానీ మంథర అనే దుర్మార్గ సలహాదారు ఆమె మనసును తప్పుదారిలో నడిపించింది. దీంతో రాముడిని వ‌న‌వాసానికి పంపించాల‌ని కైకేయి ప‌ట్టుబ‌ట్టింది.

పాఠం: నెగిటివ్‌ సలహాలు ఇచ్చే, దుర్మార్గులను దూరంగా ఉంచండి. మనసు నెగటివ్‌ అయ్యితే, మంచి లక్షణాలను మనం కోల్పోతాం.

56
క్ష‌మా గుణం
Image Credit : Asianet News

క్ష‌మా గుణం

రాముడు క్ష‌మా గుణానికి పెట్టింది పేరు. త‌న‌ను ఎంత ఇబ్బంది పెట్టిన వారికి కూడా ఏరోజు చెడు జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకున్నాడు. తను అర‌ణ్య‌వాసానికి కార‌ణ‌మైన కైకేయిని కూడా క్ష‌మ‌తో వ‌దిలి పెట్టాడు. కానీ రావ‌ణుడు మాత్రం త‌న సోద‌రి సుర్ప‌ణ‌ఖా తప్పు చేసింద‌ని తెలిసినా.. రాముడిపై కోపం పెంచుకొని ప్రతీకారంగా సీతను అపహరించాడు. అదే అత‌ని మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది.

పాఠం: క్షమించగలగడం వల్ల మనలో శాంతి, సమతౌల్యం పెరుగుతుంది. కోపం, ప్రతీకారం ఎప్పుడూ మంచి ఫలితాలను అందించ‌వు.

66
ఎప్ప‌టికైనా మంచిదే విజ‌యం
Image Credit : our own

ఎప్ప‌టికైనా మంచిదే విజ‌యం

రావణుడు శివ భ‌క్తుడు, బ్రాహ్మ‌ణుడు అయినా అత‌ని క్రూర మ‌న‌స్త‌త్వం, అహంకార గుణం అత‌ని నాశ‌నానికి కార‌ణ‌మ‌య్యాయి. సీత‌మ్మ‌ను కాపాడే క్ర‌మంలో రామ‌య్య ఎన్ని క‌ష్టాలు ఎదుర్కొన్నా చివ‌రికి విజ‌యాన్ని అందుకున్నారు.

పాఠం: జీవితంలో పరిస్థితులు ఎంత కష్టమైనా, మంచి ఎల్లప్పుడూ చెడుపై విజయం సాధిస్తుంది.

రామాయణం మనకు నేర్పిన ఈ పాఠాలు నిజంగా జీవనానికి మార్గదర్శకంగా ఉంటాయి. ఈ పాఠాలను పాటించడం ద్వారా మన జీవితంలో శాంతి, సమరస్యం, సంతృప్తి పొందవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Vijay Devarakonda: ప్ర‌మాదానికి గురైనా విజ‌య్ కారు ధ‌ర రూ. 2 కోట్లు పైమాటే.. నేల‌పై న‌డిచే విమానం
Recommended image2
Numerology: మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ ఫోన్‌లో ఏ వాల్ పేప‌ర్ ఉండాలి? డెస్టినీ నెంబ‌ర్ చెప్పేది ఇదే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved