- Home
- Astrology
- Numerology: మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ ఫోన్‌లో ఏ వాల్ పేపర్ ఉండాలి? డెస్టినీ నెంబర్ చెప్పేది ఇదే.
Numerology: మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ ఫోన్‌లో ఏ వాల్ పేపర్ ఉండాలి? డెస్టినీ నెంబర్ చెప్పేది ఇదే.
Numerology: జ్యోతిష్య శాస్త్రంతో సమానంగా న్యూమరాలజీని విశ్వసిస్తారు. అయితే న్యూమరాలజీలోనూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో డెస్టిని నెంబర్ ఒకటి. దీని ప్రకారం మన ఫోన్ వాల్ పేపర్ సెలక్ట్ చేసుకోవడం కూడా ముఖ్యమని అంటున్నారు.

ఫోన్ వాల్‌పేపర్ కేవలం అట్రాక్షన్ కోసమే కాదు
న్యూమరాలజీ ప్రకారం.. మన ఫోన్ వాల్‌పేపర్ మన జీవితంపై ప్రభావం చూపుతుంది. సరైన వాల్‌పేపర్‌ను ఎంచుకోవడం ద్వారా అదృష్టం, ఆనందం, ప్రేమ, సంపద వంటి అంశాలను ఆకర్షించవచ్చు. మన డెస్టిని నంబర్ (Destiny Number) ప్రకారం వాల్‌పేపర్‌ను ఎంచుకోవడం ముఖ్యమని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
డెస్టిని నంబర్ అంటే ఏమిటి? ఎలా గణించాలి?
డెస్టిని నంబర్ అనేది మన పుట్టిన తేదీని మొత్తంగా జోడించి చివరికి ఒక నెంబర్‌కు కుదించిన నెంబర్. ఉదాహరణకు మీరు పుట్టిన తేదీ 14/09/1990 అనుకుందాం. 1 + 4 + 0 + 9 + 1 + 9 + 9 + 0 = 33 → 3 + 3 = 6. అంటే మీ డెస్టిని నెంబర్ 6 అవుతుంది.
డెస్టిని నంబర్ ప్రకారం వాల్‌పేపర్ ఎంపిక
డెస్టిని నంబర్ 1:
* ఉదయిస్తున్న సూర్యుడు.
* మీ తండ్రి ఫొటో
* పింక్, యెల్లో లేదా ఆరెంజ్ రంగు వాల్‌పేపర్
డెస్టిని నంబర్ 2:
* ఫుల్ మూన్, తల్లి ఫోటో
* వైట్ లేదా సిల్వర్ వాల్‌పేపర్, కాంతివంతమైన, ప్రశాంతమైన ఫొటోలు.
డెస్టిని నంబర్ 3:
* పుణ్యక్షేత్రాలు, ప్రశాంతంగా ఉండే లైబ్రరీ, కుటుంబ పెద్దలతో దిగిన ఫోటో.
* యెల్లో, గోల్డెన్ లేదా పూలు కలిగిన వాల్‌పేపర్
డెస్టిని నంబర్ 4:
* కొండలు (మంచు లేకుండా), ఆకుపచ్చ అడవి, తాత/బామ్మ ఫోటో
* లైట్ బ్లూ లేదా గ్రే వాల్‌పేపర్, ఆకాశం లేదా భూమి చిత్రాలు
డెస్టిని నంబర్ 5:
* అడవి, సోదరి ఫొటోలు.
* లైట్ గ్రీన్ లేదా బ్లూ, బాంబూ వంటి ప్రకృతి చిత్రాలు
డెస్టిని నంబర్ 6:
* సంతానం, భార్య/భర్తతో ఫోటో, డబ్బు, డైమండ్
* బ్లూ వాల్‌పేపర్
డెస్టిని నంబర్ 7:
* కొండా శిఖరం, ఆలయం, జెండా, తాత/తాతమ్మ ఫోటో
* లైట్ గ్రీన్ లేదా వైట్, ఆధ్యాత్మిక చిత్రం
డెస్టిని నంబర్ 8:
* శారీరక వ్యాయామం, ప్రేరణ ఇచ్చే వ్యక్తి ఫోటో
* గ్రే లేదా పర్పుల్ వాల్‌పేపర్
డెస్టిని నంబర్ 9:
* రెడ్ జాస్పర్, రెడ్ కలర్ పువ్వులు, రెడ్ కలర్ ఆకులు
* రోస్ లేదా రెడ్ కలర్ వాల్‌పేపర్
వాల్ పేపర్ ప్రాముఖ్యత ఏంటి.?
వాల్‌పేపర్ మన మెదడుకు ఉపసహాయంగా పనిచేస్తుంది. ఇది మన అలవాట్ల, ప్రాధాన్యతలను, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన చిత్రాలను వాడడం ద్వారా మనలో సానుకూల శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోజులో ఎన్నో సార్లు ఫోన్‌ను చూస్తునే ఉంటాం. ఇది కచ్చితంగా మన మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తప్పుడు వాల్ పేపర్‌కు దూరంగా ఉండండి.
* డార్క్ కలర్, నిరుత్సాహపరిచే చిత్రాలు
* విరిగిన వస్తువులు, ముదురు ఎరుపు, నలుపు రంగులు. ఈ చిత్రాలు మన డెస్టిని నంబర్ శక్తిని అడ్డుకుంటాయి.
చివరి సూచన
ఫోన్ వాల్‌పేపర్ చిన్న మార్పు అయినా, జీవితంలో పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి డెస్టిని నంబర్ ప్రకారం వాల్‌పేపర్ మార్చడం ద్వారా అదృష్టం, సంపద, ప్రేమ, ఆనందం వంటి శక్తులను ఆకర్షించవచ్చు. కొన్ని వారాలలో మీ జీవితంలో సానుకూల మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు.
గమనిక: పైన తెలిపిన వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.