భర్త మోసం చేసినా.... భార్యలు ఎందుకు వదిలిపెట్టరో తెలుసా..?
తమ భర్తలను తమను మోసం చేసినా... ఇంకా వారితో కలిసి ఉండే మహిళలు చాలా మందే ఉన్నారు. తమ భర్త తమను మోసం చేసినా... ఇంకా ఎందుకు వారిని క్షమించామో... కొందరు మహిళలు తెలియజేశారు.
ఈ రోజుల్లో చాలా మంది ప్రతి విషయానికి విడాకులు తీసుకుంటున్నవారు ఉన్నారు. చిన్న చిన్న కారణాలకే విడిపోవాలని అనుకుంటున్నారు. కానీ... కొందరు.. విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఉన్నా కూడా... ఇంకా కలిసి ఉంటున్న దంపతులు కూడా ఉన్నారు. తమ భర్తలను తమను మోసం చేసినా... ఇంకా వారితో కలిసి ఉండే మహిళలు చాలా మందే ఉన్నారు. తమ భర్త తమను మోసం చేసినా... ఇంకా ఎందుకు వారిని క్షమించామో... కొందరు మహిళలు తెలియజేశారు. వారి కారణాలేంటో ఓసారి చూద్దాం....
‘ నా స్నేహితురాలి భర్త.. చాలా మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ విషయం నా స్నేహితురాలికి కూడా తెలుసు. కానీ.. అతను ఎంత మందితో తిరిగినా తిరిగి ఇంటికే వస్తాడని.... భర్త బాధ్యతలు, తండ్రి బాధ్యతలు నిర్వర్తిస్తాడని అందుకే వదిలిపెట్టడం లేదని నా స్నేహితురాలు చెప్పింది.’ అంటూ ఓ మహిళ తెలియజేయడం గమనార్హం.
‘నా భర్త తప్పు చేశాడు. మా ఇంటి యజమానితోనే అతను ఎఫైర్ పెట్టుకున్నాడు. అయితే...ఆ విషయంలో నా భర్తదే తప్పు అని నేను అంగీకరించలేకపోయాను. ఆ ఇంటి యజమానురాలే.. నా భర్తను వలలో వేసుకుంది అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ.. నిజానికి తప్పు చేసింది నా భర్తే.’ అని ఓ మహిళ చెప్పడం విశేషం.
‘ నా భర్త మరో మహిళతో చాలా కాలంగా సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను ఆ సమస్యను పరిష్కరించగలను అని నమ్మాను. అందుకే....నా భర్తనుండి విడిపోలేదు. మనసు మార్చుకుంటాడని ఎదురు చూశాను. అతనితో మరింత సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాను. సెక్స్ పరంగా నేను దగ్గరైతే.. నా భర్త మరో మహిళ కోసం వెళ్లడు కదా అని అనుకున్నాను’ అని మరో మహిళ చెప్పడం గమనార్హం.