MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • అమ్మాయిలకు అబ్బాయిల్లో ఇవి నచ్చవు..

అమ్మాయిలకు అబ్బాయిల్లో ఇవి నచ్చవు..

అమ్మాయిలు తమకు కాబోయే భర్త ఇలా ఉండాలి.. అలా ఉండాలని ఎన్నో ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు. అయితే అబ్బాయిల్లో ఉండే కొన్ని లక్షణాలు అమ్మాయిలకు అస్సలు నచ్చవు. అవేంటంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 25 2023, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ ప్రపంచంలో ప్రతీ వ్యక్తి ప్రత్యేకమే. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి నచ్చనిదాన్ని మరొకరు మెచ్చుకోవచ్చు. కానీ కొంతమంది పురుషుల్లో మహిళలకు నచ్చని కొన్ని లక్షణాలు ఉన్నాయి. కొంతమంది మహిళలు ఈ లక్షణాలు ఉన్న పురుషులను ఇష్టపడకపోవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం పదండి. 
 

25

కమ్యూనికేషన్ లోపం

సంబంధంలో కమ్యూనికేషన్ చాలా చాలా అవసరం. ఈ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే సంబంధంలో ఎన్నో సమస్యలు వస్తాయి. పురుషులు తమ భావాలను వ్యక్తీకరించలేకపోతే లేదా వారి ఆలోచనలు, భావాలను అర్థం చేసుకోలేకపోతే కొంతమంది మహిళలు నిరాశ చెందుతారు. ఏలాంటి సంబంధమైనా సరే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అలాగే వారితో మనస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల ఎన్నో గొడవలు జరుగుతాయి. అపార్థాలు వస్తాయి. చివరికి బంధం విడిపోయే దాకా వస్తుంది. అందుకే కొంతమంది మహిళలు స్పష్టమైన కమ్యూనికేషన్ లేని పురుషులను ఇష్టపడరు.
 

35

అగౌరవ ప్రవర్తన

సాధారణంగా మహిళలు అగౌరవపరిచే ప్రవర్తనను అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా ఇతరులను కించపరచడం, నిర్లక్ష్య వైఖరి గుణాలున్న వారంటే అస్సలు ఇష్టపడరు. ఒకరినొకరు గౌరవించుకుంటేనే సంబంధాలు బలంగా ఉంటాయి. గౌరవం ఇవ్వని సంబంధాలు అసంతృప్తిని కలిగిస్తాయి. అందుకే తమను అవమానించే ధోరణి ఉన్న పురుషులను మహిళలు ఇష్టపడరు.
 

45

తమను గౌరవించని పురుషులను మహిళలు ఇష్టపడరు. కొంతమంది మహిళలు తమపై దృష్టి పెట్టడం లేదని భావించొచ్చు. ముఖ్యంగా ఎంతో ముఖ్యమైన తేదీలను మర్చిపోవడం నుంచి మాట్లాడుకునే సమయంలో వాటిని వినకపోవడం వరకు చిన్న చిన్న విషయాలు కూడా మహిళల్లో అసంతృప్తిని కలిగిస్తాయి. సంబంధంపై ఆసక్తి ఉన్న పురుషులను,  ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకుని వారిని సంతోషపెట్టే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. 

55

వృత్తిపరమైన జీవితం అయినా, వ్యక్తిగత ఎదుగుదల అయినా జీవితంలోని వివిధ అంశాల్లో చొరవ చూపని పురుషులను మహిళలు ఇష్టపడరు. రిలేషన్ షిప్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మితిమీరిన అభద్రతాభావం, అసూయ ఉన్న భాగస్వామిని కూడా మహిళలు ఇష్టపడరు. నువ్వు నాకు మాత్రమే చెందుతావనే భావన కొంతవరకు సహజమే కావొచ్చు. కానీ మహిళలను ఎక్కువగా నియంత్రించే లేదా ఎల్లప్పుడూ వారిని అనుమానించే పురుషులను మహిళలు అస్సలు ఇష్టపడరు. ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ లో నమ్మకం ఒక ముఖ్యమైన భాగం. అలాగే ఎక్కువ అసూయ ఆ నమ్మకాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ లక్షణాలున్న పురుషులను మహిళలు ఇష్టపడరు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
వివాహేత‌ర సంబంధాల్లో దేశంలో ఏ న‌గ‌రం మొద‌టి స్థానంలో ఉందో తెలుసా.? తెలుగు వారు కూడా
Recommended image2
Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?
Recommended image3
Love: జీవితంలో ఎన్నిసార్లు ప్రేమలో పడతామో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved