Relationship: భాగస్వామికి నిజం చెప్పడం లేదా.. రహస్యాలు గుట్టుగా ఉండడం మంచిదేనా?
Relationship: సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అంటారు. కానీ అన్ని విషయాలు భాగస్వామికి షేర్ చేసుకోవటం మంచిది కాదు అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం.
భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అంటారు పెద్దలు నిజంగా అలాంటి దాంపత్యాన్ని అన్యోన్య దాంపత్యం అని అలాంటి దంపతులని ఆదర్శ దంపతులని పదిమందికి ఉదాహరణగా చూపిస్తారు.
నిజమే దంపతుల మధ్య రహస్యాలు ఉండకూడదు అలా అని ప్రతి విషయమూ చెప్పడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. సాధారణంగా జీవితానికి భాగస్వామికి పెళ్లికి ముందు జరిగిన వ్యవహారాలు ఏవీ తెలియనివ్వకపోవటమే మంచిది.
ఎంత ఉత్తమ భాగస్వామికి అయినా పోసెసివ్ నెస్ వుంటుంది. వాళ్లు మీ గతాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోవచ్చు. దీని ప్రభావం మీ భవిష్యత్తుపై మీ కాపురం పై ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ ఎక్స్ లవర్ గురించి అన్ని విషయాలు మీ భాగస్వామికి చెప్పనవసరం లేదు.
రెండవ పెళ్లి చేసుకున్న వ్యక్తి తన భాగస్వామి దగ్గర ముందు భాగస్వామి గురించి ఎంత తక్కువ ప్రస్తావన చేస్తే అంత మంచిది. ఎందుకంటే మీ భాగస్వామి కంపేరిజన్ చేసుకుని ఆత్మన్యూనత కి గురి కావచ్చు. అది కూడా మీ కాపురాన్ని సమస్యల్లోకి తీసుకు వెళ్లొచ్చు.
మీ భాగస్వామి దగ్గర నిజం చెప్పటం అవసరమే కానీ కొన్ని నిజాలు చెప్పకపోతేనే మీ కాపురం బాగుంటుంది అనిపించినప్పుడు చెప్పకుండా ఉండటం ఉత్తమ లక్షణం. అర్థం చేసుకునే భాగస్వామి అయితే మీ సమస్య తీరుతుంది కానీ ఏమాత్రం అర్థం చేసుకోని భాగస్వామికి ఇలాంటి విషయాలు తెలిస్తే మీ సమస్య మరింత జటిలం అవుతుంది.
కాబట్టి మీ జీవిత భాగస్వామితో ఏమి చెప్పితే మంచిదో అది మాత్రమే చెప్పండి. అంతేగాని ఆదర్శ దాంపత్యం అనుకొని అన్ని నిజాలు భర్తకి చెప్తే ఆఖరికి బాధపడవలసింది మనమే అని గుర్తుంచుకోండి.