శృంగారంలో పాల్గొంటే సరిపోయిందా..? తృప్తి ఉండాలిగా..!
First Published Dec 3, 2020, 3:07 PM IST
డబ్బులు సంపాదించాలనే కోరిక ఉద్యోగం ఒత్తిడి తదితర కారణాల ద్వారా... తూతు కార్యంగానే సెక్స్ లో పాల్గొంటున్నారు. అయితే శృంగారంలో పాల్గొన్నప్పటికీ సెక్స్ ని ఎంజాయ్ చేయక పోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సెక్స్ పై అందరూ ఆసక్తిని కోల్పోతూ ఉన్నారు. డబ్బు సంపాదించాలనే కోరికతో సెక్స్ కోరికను మర్చిపోతున్నారు చాలా మంది జనాలు. అయితే సమస్త జీవరాశికి ఆహారం నీరు తో పాటు శృంగారం అనేది ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. శృంగారంలో పాల్గొనడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణుల ఎన్నో పరిశోధనలు కూడా తేలింది.

అయితే ప్రస్తుతం ఆధునిక జీవితంలో చాలా మంది ఏదో శృంగారంలో పాల్గొనాలి కాబట్టి చేస్తున్నారు తప్ప శృంగార జీవితాన్ని అంతగా అనుభవించలేక పోతున్నాను. దీంతో రోజు రోజుకు శృంగారంపై అఇష్టం పెరగడమే కాకుండా..ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూ వస్తోంది. కొంతమంది సెక్స్ అనే పదాన్ని బూతు పదంలా భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అసలు సెక్స్ చేయడానికి కూడా ఇష్టపడరు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?