Relashionship: జీవిత భాగస్వామి విమర్శలతో విసిగిపోయారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే?
Relashionship: భార్యాభర్తల బంధంలో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాటికి అనేక రకాలు కారణాలు ఉంటాయి. అందులో ఒకటి తరచుగా విమర్శించుకోవడం. అయితే విమర్శలతో విసిగిపోయిన భాగస్వాములు ఏం చేయాలో చూద్దాం.
వైవాహిక బంధం లో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, ఒకరు తప్పులను ఒకరు ఎత్తి చూపించడం ఆరోగ్యకరముగా ఉన్నంతవరకు పర్వాలేదు కానీ అది ఒక వ్యసనంగా మారితే మాత్రం ఎదుటి వ్యక్తికి అది నరకంలా తయారవుతుంది.
మీ భాగస్వామి ఆత్మగౌరవం కోసము అహంకారం కోసము మిమ్మల్ని తరుచుగా విమర్శించడం వలన అది మీ బంధానికి బీటలు వారే అవకాశం ఉంది. మీ భాగస్వామి మీరు ఎంత చెప్పినా వినిపించుకోకుండా తరచుగా మిమ్మల్ని విమర్శిస్తున్నట్లయితే మీరు ఆవేశపడకండి.
అతనితో పాటు మీరు కూడా వాగ్వాదానికి దిగకండి. అతను మిమ్మల్ని విమర్శిస్తున్నాడు కదా అని మీరు కూడా అతని తప్పులను విమర్శించకండి అది వివాహ బంధం విచ్ఛిన్నం కావడానికి కారణం అవుతుంది. కాబట్టి ముందుగా మీ భాగస్వామి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో..
ఏం విమర్శించాలనుకుంటున్నారో పూర్తిగా అతను చెప్పే వరకు వినండి. అతను చెప్పినది మీరు సహనంగా వింటున్నారు అని మీ భాగస్వామి గ్రహిస్తే అతనిలో ఉన్న సగం ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. అప్పుడు అతను కూడా కాస్త శాంతంగా ఉంటాడు అప్పుడు మీరు మాట్లాడటం మొదలు పెట్టండి.
Image: Getty
మీరు అలా ఎందుకు చేయవలసి వచ్చిందో నిదానంగా చెప్పండి. ఆ తరువాత మీ భాగస్వామి చెప్పిన దాని గురించి ఆలోచించండి. అందులో ఉన్న నిజానిజాలు గ్రహించండి. మీరు మీ వైపు నుంచి ఏదైనా తప్పు చేశారేమో ఒకసారి ఆత్మ విశ్లేషణ చేసుకోండి.
Image: Getty
ఒకవేళ నిజంగానే ఆ విమర్శలకు మీరు అర్హులు అయితే మనస్ఫూర్తిగా ఎదుటి వ్యక్తిని క్షమాపణ కోరండి. లేనిపక్షంలో సహనంగా స్పష్టమైన వివరణ ఇవ్వండి. ఇంకొక విషయం మీ అందమైన బంధాన్ని కేవలం విమర్శలతో ముగింపు పలకకండి.