MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • దాంపత్య జీవితం కలకాలం ఆనందంగా ఉండాలా..? ఇవిగో ఈ ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే..!

దాంపత్య జీవితం కలకాలం ఆనందంగా ఉండాలా..? ఇవిగో ఈ ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే..!

అంతేకాదు.. ప్రతి విషయంలోనూ ఒకరికి మరొకరు తామే గ్రేట్ అని  చెప్పుకోవడం మానేయాలి. ముందు.. ఇగోలు పక్కన పెట్టాలి. ఒకరికి మరొకరు గౌరవం ఇచ్చుకోవాలి. అందరి ముందు మాత్రమే కాదు.. ఎవరూ లేని సమయంలో కూడా పనిగట్టుకొని కించపరచాలని అనుకోకూడదు,

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 27 2021, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

జీవితాంతం ప్రేమను పొందాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే.. అది ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. రోజులు గడిచే కొద్ది.. కొందరిలో ప్రేమ పెరుగుతుంటే... మరికొందరిలో మాత్రం ప్రేమ తగ్గిపోతుంది. కేవలం ప్రేమ మాత్రమే కాదు...రొమాన్స్, శృంగారం విషయంలోనూ ఇదే వర్తిస్తుంది

29

కొందరు పెళ్లైన కొంతలో విపరీతంగా శృంగారాన్ని ఆస్వాదించగలరు. కానీ కొందరు మాత్రం అలా ఆస్వాదించలేరు. మొదట్లో ఉన్న ప్రేమ ఉండదు. చిన్న విషయాలకే విస్కుకోవడం లాంటివి చేస్తారు. దేనిని ఆస్వాదించలేరు. మరి అలాకాకుండా.. దంపతుల మధ్య ప్రేమ, కలయిక ఎప్పుడూ కొత్తగా ఉత్సాహంగా ఉండాలంటే.. కొన్ని రూల్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూస్తే...

39

మీ భాగస్వామిని ఎప్పటికప్పుడు రకరకాలుగా ఆశ్చర్యపరచడం మర్చిపోవద్దు. చిన్న బహుమతితో సర్ ప్రైజ్ చేయాలి, మీ భాగస్వామికి ఇష్టమైన భోజనం వండటం లాంటివి చేయాలి. లేదంటే వీకెండ్స్ లో సరదాగా ఎక్కడైనా గడపడానికి వెళ్లిరావడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల వారి బంధం కలకలం ఆనందంగా సాగుతుంది

 

 

49

అంతేకాదు.. ప్రతి విషయంలోనూ ఒకరికి మరొకరు తామే గ్రేట్ అని  చెప్పుకోవడం మానేయాలి. ముందు.. ఇగోలు పక్కన పెట్టాలి. ఒకరికి మరొకరు గౌరవం ఇచ్చుకోవాలి. అందరి ముందు మాత్రమే కాదు.. ఎవరూ లేని సమయంలో కూడా పనిగట్టుకొని కించపరచాలని అనుకోకూడదు,

59


కొందరు దంపతులు వారి రిలేషన్ మొదట్లో.. క్రమం తప్పకుండా స్పెషల్ డేట్స్ కి వెళుతుంటారు. వాటిని రోజులు గడిచే కొద్దీ ఆపేస్తుంటారు. అయితే.. అలా ఆపకూడదట. తీరిక దొరికిన ప్రతిసారీ తమకంటూ సమయం కేటాయించుకుంటూ ఉండాలి. డేట్స్ కి వెళ్లాలి. ఏకాంతంగా గడపాలి. ఇలా చేయడం వల్ల కూడా బంధం మరింత బలపడుతుంది

69

ఒకరికొకరు దూరంగా ఉండే సందర్భాలు కూడా రావొచ్చు. అంటే.. ఒకరు ఆఫీసులో ఉంటే మరొకరు ఇంట్లో ఉండొచ్చు. అలాంటి సమయంలో అప్పుడప్పుడు రొమాంటిక్ మెసేజ్ లు పంపాలి. ఇలా చేయడం వల్ల కూడా వారు రోజూ ప్రేమలో పడినట్లు భావిస్తుంటారు.

79

ఎప్పుడూ ఒకే రెస్టారెంట్ కి కాకుండా.. ఏదైనా కొత్త దానికి వెళుతూ ఉండాలి. అక్కడ డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయాలి. లేదంటే ఏదైనా అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్లేస్ కి వెళ్లడం.. థ్రిల్ కలిగించే పనులు చేయడం లాంటివి తరచూ చేయాలి.
 

89

మీ పార్ట్ నర్ పై రొమాంటిక్ ఫీల్ ని వ్యక్తపరచడంలో ఎలాంటి సంకోచం పెట్టుకోకూడదు. రోజుకొకసారైనా మీరు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పాలి. సెక్స్ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా మనసు విప్పి మాట్లాడుకోవాలి

99

కపుల్ గోల్స్ పెట్టుకోవాలి. అంటే... ఎదైనా వెకేషన్ కి వెళ్లాలని అనుకుంటే..దానికి తగిన డబ్బులు ఇద్దరూ కలిపి దాచుకోవడం లాంటివి చేయాలి. ఎవరు ముందుగా దానిని ఫిల్ చేస్తారు అనే కాంపిటేషన్ పెట్టుకోవడం లాంటి సరదా గేమ్స్ పెట్టుకోవాలి. ఇంట్లోని పనులు కలిసి షేర్ చేసుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship: సోషల్ మీడియా భార్యా భర్తల మధ్య చిచ్చు పెడుతోందా? నిపుణుల మాట ఇదే!
Recommended image2
వివాహేత‌ర సంబంధాల్లో దేశంలో ఏ న‌గ‌రం మొద‌టి స్థానంలో ఉందో తెలుసా.? తెలుగు వారు కూడా
Recommended image3
Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved